Begin typing your search above and press return to search.

తమన్నా దాంట్లో 10వేల మందిని దాచుకుందట

By:  Tupaki Desk   |   10 March 2016 10:17 AM IST
తమన్నా దాంట్లో 10వేల మందిని దాచుకుందట
X
మిల్కీ బ్యూటీ తమన్నా హ్యాపీ డేస్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక తన దశదీసే మారిపోయింది. పెద్ద స్టార్ల సరసన నటిస్తూ, అప్పుడప్పుడూ ఐటెం సాంగ్ లలో అలరిస్తూ ఇక్కడ సత్తా చాటుకోవడమేకాక బాలీవుడ్ లో సైతం తన అదృష్టం పరీక్షించుకుంటుంది.

ప్రస్తుతం ఊపిరి సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న తమ్ము బేబీ తన పెర్సనల్ విషయాలు చెప్పుకొచ్చింది. తన కెరీర్ లో 100%లవ్ పెద్ద మలుపని చెప్పింది. తనకి దైవారాధనపై నమ్మకం వుందని, వినాయకుడిని పుజిస్తానని తెలిపింది. వంటల్లో చికెన్ అంటే ప్రాణమట. ఈ రెండిటిని 100% లవ్ లో పెట్టడం యాదృచికం.

అంతేకాక తనవరకూ ఎంతో విలువైన వస్తువు తన సెల్ ఫోనేనట. అందులో ఏకంగా 10వేలకు పైగా నెంబర్లను దాచుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ అమ్మడికి టైటానిక్, DDLJ సినిమాలంటే చాలా ఇష్టమట.