Begin typing your search above and press return to search.
ఏడుపొద్దంటున్న తమన్నా
By: Tupaki Desk | 30 April 2016 4:23 AM GMTఎంతైనా తమన్నా టేస్టే వేరబ్బా. చేయడానికి ఎలాంటి సినిమాలైనా చేస్తా కానీ... చూసే విషయంలో మాత్రం కొన్నిటికి దూరంగా వుంటానని చెబుతోంది. చేయడానికి లేని సమస్య చూడ్డానికేమొచ్చిందమ్మా అని అడిగితే... ఏడవడానికి సినిమాకి ఎందుకు వెళ్లడం అంటూ తనదైన శైలిలో సమాధానమిస్తోంది. బహుశా ఆ సమాధానంలోనే ఆమె గ్లామర్ రహస్యముందేమో అనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళితే తమన్నాకి ఏడుపుగొట్టు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదట. ఆనందాన్నిరెట్టింపు చేసే సినిమాల్నే చూస్తుందట. అదికాదంటే కనీసం మెదడుకి పనిపెట్టేలాగైనా సినిమా వుండాలట. అలాంటివి చూడ్డానికే ఇష్టపడుతుందట తమన్నా.
అదే మీ గ్లామర్ రహస్యమా అంటే... ``ఎందుకో తెలియదు, చిన్నప్పట్నుంచి జోష్ నిచ్చే సినిమాలే ఇష్టం. హార్రర్ చిత్రాల్ని కూడా పెద్దగా చూడను. నటిని కాబట్టి అన్ని రకాల సినిమాలూ చేయాల్సి వస్తుందనుకోండి. కాకపోతే కొన్నిసార్లు ఏడిపించే సినిమాల్ని చేయడానికి కూడా మనసొప్పదు. అందుకే నా దృష్టి ఎప్పుడూ ఎంటర్ టైనింగ్ సినిమాలపైనే వుంటుంది`` అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఆమె తెలుగు - తమిళం - హిందీ భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.