Begin typing your search above and press return to search.

తమ్మూ.. అభినేత్రి చేయడానికి అదే కారణమట

By:  Tupaki Desk   |   4 Jun 2016 12:12 PM IST
తమ్మూ.. అభినేత్రి చేయడానికి అదే కారణమట
X
తాను ‘అభినేత్రి’ సినిమా చేయడానికి ప్రధాన కారణం ప్రభుదేవానే అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రభుదేవాను కలవొచ్చు.. కలిసి పని చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ సినిమా చేశానని.. తనకు ఆయనంటే అంత అభిమానమని ఆమె చెప్పింది. ‘అభినేత్రి’ టీజర్ రిలీజ్ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘ప్రభుదేవాను అందరూ కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటుంటారు. ఆయన్ని అలా కాకుండా గాడ్ ఆఫ్ డ్యాన్స్ అని పిలవాలి. ఆయన్ని కలవొచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ సినిమా ఒప్పుకున్నా. నేను ప్రభుదేవాకు ట్రిబ్యూట్ గా ఓసారి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాను. నా జీవితంలో అదే బెస్ట్ డ్యాన్స్ అని అనుకుంటున్నా. ప్రభుదేవా చాలా చాలా సింపుల్ గా ఉంటారు. ఆ సింప్లిసిటీ వల్లే ఈ వయసులోనూ అంత అందంగా ఉంటున్నారు. ‘అభినేత్రి’ టీజర్లో ఆయన డ్యాన్స్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాలో డ్యాన్స్ కంటే నటనతో కట్టిపడేస్తారు. ఇక ‘అభినేత్రి’ అందరూ అనుకుంటున్నట్లు హార్రర్ ఫిల్మ్ కాదు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా కాదు. ఇదొక సరికొత్త చిత్రం. దీని ప్రత్యేకత ఏంటన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి’’ అని తమన్నా చెప్పింది.

ప్రభుదేవా మాట్లాడుతూ.. తాను ముంబయికి వెళ్తే డైరెక్టర్ అని.. హైదరాబాద్ వస్తే మాత్రం డ్యాన్సర్ అని అన్నాడు. ‘అభినేత్రి’ కథ నచ్చడంతో తాను నిర్మాణ భాగస్వామిగా కూడా మారడానికి ఒప్పుకున్నానని.. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఎలా చెబితే అలా నటించానని.. ఇలాంటి సినిమాతో సౌత్ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందని ప్రభుదేవా చెప్పాడు.