Begin typing your search above and press return to search.

9-9-9-9 అంటున్న 'అభినేత్రి'

By:  Tupaki Desk   |   7 Sept 2016 1:00 AM IST
9-9-9-9 అంటున్న అభినేత్రి
X
నెంబర్లపై టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇతర ఫిలిం ఇండస్ర్టీలు కూడా భలే సరదా పడుతుంటాయి. రిలీజ్ డేట్ నుండి ఒక స్టార్ హీరో కార్ నెంబర్ వరకు.. ఫ్యాన్సీ నెంబర్లంటే తెగ మోజు ఉంటుంది. ఇప్పుడు మిల్కీ బ్యూటి తమన్నా కూడా సేమ్ టు సేమ్ అలాంటి ఫ్యాన్సీ డేట్ ఒకటి సెట్ చేసుకుంది. తన మేకర్లతో కలసి 'అభినేత్రి' సినిమా కోసం ఒక టెంప్టింగ్ డేట్ లో ట్రైలర్ రిలీజ్ చేయనుంది అమ్మడు.

ఇప్పటికే అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా అభినేత్రి (తెలుగు వర్షన్).. దేవి (తమిళం).. టు ఇన్ వన్ (హిందీ) సినిమా మూడు బాషల్లోనూ విడుదలవ్వనుందని ప్రకటించేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను మాత్రం 9వ నెల - 9వ తారీఖు - 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేస్తారని ప్రకటించేశారట. అన్నీ 9 లు ఉన్నాయిలే ఈ అంకెలో.. 9-9-9-9 అంటే సెప్టెంబర్ 9న - పొద్దున్న 9.09 ని.లకు అని వేరే చెప్పక్కర్లేదులే. ఈ రేంజులో ప్రమోట్ చేస్తే కాని సినిమాకు హైప్ రాదని అనుకున్నారమే.

అయితే ఈ సినిమాలో తమన్నా గ్లామర్ - డ్యాన్సింగ్ - పోష్‌ క్యారెక్టర్ లో చూపించి యాటిట్యూడ్ - మరో క్యారెక్టర్లో పనమ్మాయ్ గా ఆమె చూపించిన నటన.. అద్భుతం అంటూ ఇప్పటికే దర్శకుడు ఏ.ఎల్.విజయ్ - ప్రొడ్యూసర్ కమ్ హీరో ప్రభుదేవా - మరో ప్రొడ్యూసర్ కమ్ హీరో సోనూ సూద్ పొగిడేస్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో!!