Begin typing your search above and press return to search.
ఒక్క మాటలో తేల్చేసిన తమన్నా
By: Tupaki Desk | 16 Dec 2018 1:47 PM GMTకొన్ని నెలలుగా సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ గురించి ఏ స్థాయిలో రగడ నడుస్తోందో తెలిసిందే. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినీ రంగంలో అమ్మాయిలపై జరిగే లైంగిక వేధింపుల గురించి పెద్ద ఎత్తున గళం విప్పారు. ఈ ఆరోపణలు ఇండస్ట్రీలు ఇండస్ట్రీల్ని కుదిపేశాయి. బాలీవుడ్లో తనూశ్రీ దత్తా.. కోలీవుడ్లో చిన్మయి లాంటి వాళ్లు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్లకు మరిందరు గొంతు కలిపారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటన్నట్లుగా మాట్లాడుతున్నారు. సినీ రంగంలో అందుకు అవకాశమే లేదనేస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఇలాగే మాట్లాడుతోంది. ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ప్రసక్తే ఉండదని ఆమె తేల్చేసింది. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిల్ని సెక్సువల్ ఫేవర్స్ అడుగుతారనేది అబద్ధపు ప్రచారం అని ఆమె చెప్పింది.
సినిమాలు కోట్లు ఖర్చు పెట్టి తీస్తారని.. తీరిక లేకుండా పని చేస్తారని.. అలాంటపుడు హీరోయిన్లను వేధించేందుకు తీరికే ఉండదన్నట్లుగా తమన్నా లాజిక్ తీసింది. ఇండస్ట్రీలో ఎవ్వరూ అలాంటి పనులు చేస్తారని తాను అనుకోవడం లేదని తమన్నా స్పష్టం చేసింది. ఐతే ఒకవేళ తమన్నాకు ఇలాంటి చేదు అనుభవాలేమీ లేకపోతే.. తనకు ఆ పరిస్థితి ఎదురు కాలేదని చెప్పాలి. అంతే తప్ప ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచే లేదనడమే విడ్డూరం. ఓవైపు పలువురు అమ్మాయిలు తమకు ఎదురైన అనుభవాల గురించి చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. అందులో అందరూ నిజాలే చెబుతున్నారని అనుకోలేం. అదే సమయంలో అందరివీ అబద్ధాలే అని కొట్టిపారేయలేం. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే.. వారిపై అనధికారిక బహిష్కరణ జరుగుతోంది. కెరీర్లే దెబ్బ తింటున్నాయి. అది తెలిసి కూడా తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్లెంతగా వేదనకు గురై ఉండాలి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని తమన్నా సర్టిఫికెట్ ఇవ్వడం అలాంటి బాధితుల్ని అవమానించినట్లే కదా?