Begin typing your search above and press return to search.
లక్ష్మీ నరసింహారెడ్డి.. ఆ పిలుపే కాంప్లిమెంట్
By: Tupaki Desk | 3 Oct 2019 2:30 PM GMTమిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్ బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నానని సంబరంగా చెబుతోంది. సైరా నరసింహారెడ్డిలో తన పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురుస్తున్నాయని తెలిపింది. ఒక రకంగా నయన్ కంటే తమన్నానే ఎక్కువగా హైలైట్ అయ్యిందని పలువురు విశ్లేషిస్తున్న సంగతి తమన్నా చెవిన పడినట్టుంది. అందుకే నేడు హైదరాబాద్ లో జరిగిన సైరా సక్సెస్ వేదికపై మిల్కీ ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ``నా కెరీర్ బెస్ట్ రోల్ లక్ష్మీ ఇచ్చినందుకు సూరి సర్ కి థాంక్స్. ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో సినిమాని చూసుకున్నా. నన్ను అంతగా చూపినందుకు థాంక్స్`` అని తమన్నా అంది.
ఇన్నాళ్లు అవంతిక.. నీహారిక అంటూ పిలిచారు. ఇప్పుడు లక్ష్మీ నరసింహారెడ్డి అని పిలుస్తున్నారు. ఒక నటిగా అదే నాకు బిగ్ కాంప్లిమెంట్. నా కెరీర్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇది. చిరు సర్ డ్రీమ్ ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేర్చుకునేందుకు ఎంతో మంచి అవకాశం దక్కింది. నా నటన బావుంది అని చిరు సర్ అంటే అది చాలు అనుకునేదానిని. అలాంటిది లక్ష్మీ పాత్రలో అవకాశం ఇచ్చారు అంటూ ఆనందం వ్యక్తం చేసింది తమన్నా.
చిరంజీవి.. మెగాస్టార్ ఎందుకు అయ్యారు? అన్నదానికి మిల్కీ ఇచ్చిన వివరణ ఆకట్టుకుంది. ఆయన అంత సింపుల్ గా ఉంటారు. ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. అందుకే మెగాస్టార్ అయ్యారు అని పొగిడేసింది మిల్కీ. ఈ సినిమాకి సుశ్మిత కాస్ట్యూమ్స్ అద్భుతంగా డిజైన్ చేశారని... తనతో కలిసి పని చేయడం హ్యాపీగా ఉందని... మళ్లీ మళ్లీ కలిసి పని చేస్తానని తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తన మేకప్ హెయిర్ స్టైల్ విభాగం ఎంతో శ్రమించారని తమన్నా గుర్తు చేసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపింది ఈ బ్యూటీ.