Begin typing your search above and press return to search.
పూలేనా? చెప్పులు కూడా ఓకె -తమన్నా
By: Tupaki Desk | 8 Feb 2018 10:23 AM GMTతమన్నా ఎప్పుడూ ఊహించని ఘటన అది. ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం పట్టే అభిమానుల మధ్య నుంచే ఓ చెప్పు మీదకు వస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు. కానీ తమన్నాకు హైదరాబాద్ లోనే ఆ సంఘటన ఎదురైంది. అది జరిగాక ఆమె అక్కణ్నించి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు ఓ ఇంటర్య్వూలో మాట్లాడింది.
వారం క్రితం హైదరాబాద్ లో షోరూమ్ ఓపెనింగ్ కు వచ్చింది తమన్నా. అందాల ముద్దుగుమ్మలా తయారై అభిమానుల ముందుకు వచ్చింది. షాప్ ఓపెనింగ్ అయిపోయాక... అభిమానులకు హాయ్ చెపుతూ నిల్చుంది. ఇంతలో జనం మధ్యలోంచి ఓ యువకుడు తన బూటు తీసి ఆమె మీదకు విసిరాడు. అదృష్ట వశాత్తూ అది ఆమెకు తగలకుండా పక్కకి పడిపోయింది. దీంతో బౌన్సర్లు ఆమెను గబగబా అక్కణ్నించి తీసుకెళ్లిపోయారు. అలాగే ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు తనకు తమన్నా అంటే అభిమానమని - కానీ ఆమె మంచి సినిమాలు చేయడం లేదన్న కోపంతో విసిరానని చెప్పాడు.
ఈ ఘటనపై తమన్నా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ... నటిగా ఉన్నప్పుడు అభిమానులు పూల బొకేలు ఇచ్చి స్వాగతించినప్పుడే కాదు - ఇలా చెప్పులు విసిరినప్పుడు కూడా మౌనంగా ఉండాల్సిందేనని చెప్పింది. షోరూమ్ దగ్గర చాలా సెక్యురిటీ ఉన్నప్పుడు అలా జరిగిందని గుర్తు చేసుకుంది. అంతేకానీ ఆ యువకుడిని ఒక్కమాట అనలేదు మిల్కీ బ్యూటీ.