Begin typing your search above and press return to search.

తమన్నా తప్ప అందరూ చూశారట..

By:  Tupaki Desk   |   16 March 2016 3:30 PM GMT
తమన్నా తప్ప అందరూ చూశారట..
X
హాలీవుడ్, కొరియన్, ఫ్రెంచ్ సినిమాల్ని మనోళ్లు ఫ్రీమేక్ చేయడమే తప్ప.. అఫీషియల్ గా రీమేక్ రైట్స్ తీసుకుని.. తెలుగులో తీయడం అన్నది ఇప్పటిదాకా జరగలేదు. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ పీవీపీ సంస్థ.. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’ రైట్స్ అఫీషియల్ గా కొనుక్కుని తెలుగు - తమిళ భాషల్లో ఊపిరి/తొళ సినిమాను నిర్మించింది. ఫ్రెంచిలో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ‘ది ఇన్ టచబుల్స్’ ఒకటని ప్రపంచమంతా పొగిడింది. అలాంటి సినిమాను తీసుకుని.. తెలుగు - తమిళ నేటివిటీకి తగ్గట్లుగా తీర్చిదిద్దాడు వంశీ పైడిపల్లి. ఐతే రీమేక్ అన్నాక అందులో నటించే నటీనటులు ఒరిజినల్ చూడాలని కోరుకోవడం సహజం. ఐతే తమన్నా మాత్రం ‘ది ఇన్ టచబుల్స్’ చూడలేదట. యూనిట్లో అందరూ ఈ సినిమా చూసినా.. తమన్నా మాత్రం అందుకు ఇష్టపడలేదట.

దీనికి కారణం ఏంటి అని అడిగితే.. ‘‘సినిమాలో ఉన్న లేడీ క్యారెక్టర్ తో పోలిస్తే నాది పూర్తి భిన్నమైన పాత్ర అని దర్శకుడు వంశీ చెప్పారు. అలాంటపుడు ఒరిజినల్ చూడటం ఎందుకనిపించింది. ఆ పాత్ర ప్రభావం నా మీద లేకుండా ఒరిజినల్ గా నటించాలన్న ఉద్దేశంతో కూడా ఆ సినిమా ఇప్పటిదాకా చూడలేదు. ‘ఊపిరి’ విడుదలయ్యాక ‘ది ఇన్ టచబుల్స్’ చూస్తానేమో’’ అని చెప్పింది తమ్మూ. చక్రాల కుర్చీకి పరిమితం అయిపోయే పాత్రను ఒప్పుకోవడం నాగార్జున గొప్పదనమని అన్న తమ్మూ.. తనకు అలాంటి పాత్ర వస్తే చేయడానికి సిద్ధమని చెప్పింది. చిరంజీవి 150వ సినిమాకు కథానాయికగా అడిగినట్లు వచ్చిన రూమర్లపై మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి రూమర్లు ఎలా పుడతాయో తెలియదు. నా సినిమాలకు సంబంధించిన విశేషాల్ని నేను దాచుకోను. ఓ సినిమా ఒప్పుకోగానే ఈ సినిమా చేస్తున్నా అని ట్విట్టర్లో చెప్పేస్తా. ఇలాంటి రూమర్లు మాత్రం పుట్టించవద్దు’’ అని తమ్మూ కోరింది.