Begin typing your search above and press return to search.
ఐటెం సాంగ్స్ కు మిల్కీ 'గౌరవం'
By: Tupaki Desk | 8 Sep 2017 6:11 AM GMTచిన్నా పెద్దా అనే తేడాల్లేకుండా ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్స్ తప్పనిసరి అయిపోయాయి. ఇలాంటి పాటలు లేని మూవీస్ ఒకటీ అరా మించి రావట్లేదు కూడా. వీటికోసం అంటూ స్పెషల్ గా కొందరు డ్యాన్సర్లు ఉంటున్నా.. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా ఇలాంటి పాటల్లోకి చొచ్చుకొచ్చేస్తున్నారు. సినిమాను బట్టి.. హీరోను అనుసరించి ఒకోసారి ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ పుచ్చుకుని మరీ నటించేస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికి రెండు సార్లు ఐటెం సాంగ్స్ లో కనిపించింది. అల్లుడు శీను.. స్పీడున్నోడు చిత్రాలలో ఐటెం పాటలలో అలరించిన తమన్నా.. ఈ దసరా స్పెషల్ గా రిలీజ్ కానున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ జై లవ కుశలో కూడా ఐటెం సాంగ్ లో నటిస్తోంది. అయితే.. హీరోయిన్స్ ఇలా ఐటెం సాంగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న.. రీసెంట్ గా ఈమెకు ఎదురైంది. దీనికి తమ్ము ఆన్సర్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. 'అసలు హీరోయిన్ అంటేనే గ్లామర్ కదా.. మరి అలాంటి గ్లామర్ కోసమే ఓ పాటను డెడికేట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. స్టోరీకి సపోర్ట్ చేయడానికి.. కథకు ఊపు తెచ్చే శక్తిని అందించడానికి ఐటెం సాంగ్ ఉపయోగపడుతుంది. అందుకే ఇలాంటి పాటల్లో నటించడాన్ని గౌరవంగా భావిస్తాను' అని చెప్పుకొచ్చింది మిల్కీ.
అయితే.. కేవలం ఐటెం సాంగ్స్ తో సినిమాలు ఆడవనే సంగతి తనకు తెలుసని.. కానీ మంచి మూవీకి మాత్రం ఈ సాంగ్స్ బాగా హెల్ప్ అవుతాయని చెప్పింది తమన్నా. పైగా ఫీచర్ ఫిలిమ్స్ కోసం సుదీర్ఘంగా నటిస్తూనే ఉండే తమకు.. ఇలాంటి ఐటెం సాంగ్స్ కాసింత రిక్రేయేషన్ టైపులో ఉంటాయని కూడా చెప్పింది. అయితే.. నాలుగైదు రోజుల షూటింగ్ తో 50 లక్షల నుంచి కోటి రూపాయలు అందుతుండడంతోనే.. ఇలాంటి పాటలకు స్టార్ హీరోయిన్స్ మొగ్గు చూపుతున్నారనే వాదన కూడా కొట్టి పారేయలేం.