Begin typing your search above and press return to search.

మిల్కీ అందాలతో హలో చెబుతుంటే!!

By:  Tupaki Desk   |   4 Feb 2017 1:42 PM GMT
మిల్కీ అందాలతో హలో చెబుతుంటే!!
X
బాలీవుడ్ బ్యూటీ అనిపించేసుకుందామని మిల్కీ బ్యూటీ తమన్నా గట్టి ప్రయత్నాలే చేస్తోంది కానీ.. ఇప్పటివరకూ పెద్దగా వర్కవుట్ ఏమీ కాలేదు. ఒకట్రెండు అవకాశాలు వచ్చినా.. బాహుబలి మినహాయిస్తే ఈ మురి'పాల' సోయగానికి ఇతర గుర్తింపు రాలేదు. సౌత్ హీరోయిన్ గానే చెలామణి అవుతున్న తమన్నా.. తాను బాలీవుడ్ బ్యూటీస్ కి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకునేందుకు బాగానే ట్రై చేస్తోంది.

ముంబై వెళ్లాక స్టైలింగ్ కి ఉన్న ఇంపార్టెన్స్ అర్ధం చేసుకున్నానని రీసెంట్ గా చెప్పిన తమ్మూ.. డ్రెసింగ్ విషయంలో కేర్ ఎక్కువగానే తీసుకుంటోంది. అయితే.. తాజాగా హెలో మేగజైన్ కోసం అమ్మడు చేసిన ఫోటో షూట్ చూస్తే.. స్టైలింగ్ కంటే క్లీవేజ్ షో విషయంలో బాలీవుడ్ నుంచి బాగానే పాఠాలు నేర్చుకున్నట్లుగా అనిపిస్తుంది. మిల్కీ అందాలను ఆరబోసేసి ఇచ్చిన పోజ్.. ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది. అటు హెయిర్ స్టైల్ విషయంలో కొత్తగా ట్రై చేసింది తమన్నా.

పాల నురుగు లాంటి దేహం.. ఆకట్టుకునే అందం.. సోయగాలు చూపించేందుకు సిద్ధం అనే సంకేతాలు.. అన్నిటికి మించి ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే తత్వం.. ఇన్నేసి క్వాలిటీస్ ఉన్నా.. ఇంకా బాలీవుడ్ లో సెటిల్ కాలేకపోవడానికి కారణం.. తమన్నాకే అంతుబట్టడం లేదట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/