Begin typing your search above and press return to search.

వెట‌ర‌న్ న‌టి ట‌బుని ఫాలో అవుతున్న‌ మిల్కీ

By:  Tupaki Desk   |   17 Aug 2021 8:30 AM GMT
వెట‌ర‌న్ న‌టి ట‌బుని ఫాలో అవుతున్న‌ మిల్కీ
X
వెట‌ర‌న్ స్టార్ ట‌బుని షాడోలా ఫాలో చేస్తోంది ఎవ‌రు?... జాతీయ ఉత్త‌మ న‌టినే టార్గెట్ చేస్తోందా ఆ షాడో? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. టాలీవుడ్ లో వెట‌ర‌న్ హీరోయిన్ ట‌బు చేసింది కొన్ని సినిమాలే అయినా త‌నదైన‌ మార్క్ వేసి బాలీవుడ్ లో స్థిర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తెలుగులోనూ అగ్ర నాయిక‌గా సుప‌రిచితం. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ట‌బుకి ఉన్న ప్రేమాప్యాయ‌త‌లు గుర్తింపు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి. నాగార్జున‌- చిరంజీవి- వెంక‌టేష్- బాల‌కృష్ణ లాంటి అగ్ర హీరోల‌ స‌ర‌స‌న న‌టించి ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే ఇప్ప‌టికీ ట‌బు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ లోనే ఉంటున్నారు. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌రు. చిన్న సినిమా..పెద్ద సినిమా అనే బేధం లేకుండా మంచి పాత్ర అయితే న‌టిస్తున్నారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో `అల‌వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌లైన మ‌లయాళ సినిమాల‌పైనా దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నారు. ఓ న‌టి సెకెండ్ ఇన్నింగ్స్ లో మూడు భాష‌ల‌పై ఫోక‌స్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ ట‌బు వాటిని ప‌క్కా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప్లాన్ చేసుకుని మందుకు సాగుతున్నారు. ఆ ర‌కంగా సినిమాల ప‌ట్ల త‌న‌కున్న ఫ్యాష‌న్ ని చాటి చెబుతున్నారు. ట‌బులానే అదే మార్గంలో వెళ్తానంటూ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కూడా చాలాసార్లు మీడియా ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా కూడా ట‌బులానే ప‌క్కా ప్లాన్ తోనే ముందుకెళ్తున్న‌ట్లు త‌న‌ ప్లానింగ్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

అవ‌కాశాలు వ‌చ్చినంత కాలం హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న త‌మ‌న్నా అటుపై ఎంత‌మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఐట‌మ్ గాళ్ గానూ ఫోక‌స్ అయ్యే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఐట‌మ్ పాట‌ల్లో న‌ర్తించి త‌న‌లో మ‌రో కోణాన్ని కూడా న‌ట‌వృత్తిలో భాగంగా బ‌య‌ట‌కు తెచ్చింది. ప్ర‌స్తుతం యూత్ స్టార్ నితిన్ న‌టిస్తున్న మాస్ట్రో సినిమాతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను ఎంట్రీ ఇస్తోంది.

అలాగే మెగాస్టార్ స‌ర‌స‌న సైరా లాంటి పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన త‌మ‌న్నా.. త‌దుప‌రి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ 15వ చిత్రం లోనూ న‌టించ‌నుంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీ. ఇందులో త‌న‌లోని విల‌నీని కూడా ఆవిష్క‌రించ‌నుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మీల్కీబ్యూటీ విల‌న్ గా క‌న‌పించ‌నుంది. అటు బుల్లి తెరపై మాస్ట‌ర్ చెఫ్ అనే తెలుగు ప్రోగ్రామ్ కి హోస్ట్ గాను వ్య‌వ‌హ‌రిస్తూ అల‌రిస్తోంది. త‌మ‌న్నా ఇలా త‌న‌వైపు వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌కుండా ముందుకు వెళ్ల‌డం త‌న ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం అని చెప్పాలి. త‌న ఫేవరెట్ న‌టి టబు స్ఫూర్తితో మిల్కీ చేస్తున్న ప్ర‌య‌త్నాలను ప్ర‌శంసించాలి. మునుముందు జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు లా గొప్ప అవార్డులు రివార్డులు కూడా త‌మ‌న్నా కి ద‌క్కాల‌ని ఆ స్థాయి ఎంపిక‌ల‌తో దూసుకెళ్లాల‌ని ఆకాంక్షిద్దాం.