Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తమ్మూ తపన చూడండహో

By:  Tupaki Desk   |   7 Oct 2015 4:00 PM IST
ఫోటో స్టోరి: తమ్మూ తపన చూడండహో
X
'బాహుబలి' హిందీలో కూడా హిట్టవ్వడంతో.. తొలిసారిగా బాలీవుడ్‌ లో తన ఖాతాలో ఒక హిట్టు వేసుకోగలిగింది మిల్కీ బ్యూటి తమన్నా బాటియా. అప్పటివరకు హిందీలో ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా అవన్నీ ఫట్లే అయ్యాయ్‌. అందుకే బాహుబలి సినిమాను అమ్మడు అక్కడ ఓ రేంజులో ప్రమోట్‌ చేసి తొలి హిట్‌ అందుకుంది.

కాని బాహుబలి సినిమా విషయంలో.. క్రెడిట్‌ అంతా ఎక్కువగా రాజమౌళి కొట్టేస్తే.. ఆ మిగిలిన కాస్తా ప్రభాస్‌ పట్టుకుపోయాడు. అందుకే ఆ సినిమాలోని మిగిలిన యాక్టర్లందరికీ ఉన్నపలంగా పెద్దపెద్ద ఆఫర్లేమీ ఊడిపడలేదు. అలాగే తమన్నా కూడా ఒక్కసారిగా భారీ భారీ బ్రాండ్లకు అంబాసిడర్‌ అయిపోవడం.. పెద్ద పెద్ద మ్యాగజైన్ల కవర్‌ పేజీల మీద ఫోజులిచ్చేయడం.. హిందీలో ఓ నాలుగైదు
సినిమాలు సైన్‌ చేయడం వంటివి జరగలేదు. కాకపోతే వచ్చిన అవకాశాలను మాత్రం అమ్మడ సద్వినియోగం చేసుకొని తపన చూయిస్తోంది.

అక్కడ చూడండి.. హలోమ్యాగజైన్‌ అక్టోబర్‌ ఎడిషన్‌ కోసం.. అమ్మడు ఏకంగా క్లీవేజ్‌ అందాలతో మతిపోగొట్టాలని ప్రయత్నిస్తోంది. తపన బాగానే ఉంది కాని.. అలాంటి అందాలతో ఏమార్చేంత ఎథలెటిక్‌ బాడీ అమ్మడికి లేదని ఒక కామెంట్‌ వినిపస్తోందిప్పుడు. సర్లేండి.. మ్యగ్జిమం హాట్‌ గా ఉండటానికి ట్రై చేసింది.. మరి ఏమన్నా వర్కవుట్‌ అవుతుందేమో చూద్దాం.

For More Pics : http://www.tupaki.com/photogallery/actress/Tamannaah-poses-for-Hello/1150