Begin typing your search above and press return to search.

సెల్ఫీ అడిగితే తుర్రుమన్న తమన్నా

By:  Tupaki Desk   |   19 Dec 2015 4:41 AM GMT
సెల్ఫీ అడిగితే తుర్రుమన్న తమన్నా
X
సినిమా స్టార్స్ కనపడితే ఆటోగ్రాఫ్ లు అడగడం, వారి సంతకాలతో ఉన్న ఫోటోలు కలెక్ట్ చేసుకోవడం ఇప్పుడు లేదు. ఒంటిపై తమకు నచ్చిన ప్రాంతంలో సంతకాలు చేయించుకునే కల్చర్ కూడా కొన్నాళ్లు నడిచింది. ఇప్పుడవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి. ఎవరు కనపడ్డా.. ఓ సెల్ఫీ అడిగేస్తున్నారు ఫ్యాన్స్. కుదిరితే భుజం మీద ఓ చెయ్యి వేయించుకుని మరీ ఫోటో దిగేస్తున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన బాజీరావ్ మస్తానీ ప్రదర్శనలో సడెన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా దర్శనమిచ్చింది. తన తల్లితోపాటు కొంతమంది అసిస్టెంట్లను కూడా వెంటబెట్టుకుని.. ప్రసాద్స్ లో ఉదయం 8.45 షో చూసింది తమన్నా. సడెన్ గా తమ అభిమాన హీరోయిన్ తమతో కలిసి సినిమా చూస్తున్న సన్నివేశాన్ని చూసిన ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. థియేటర్ లో ఉన్నంతవరకూ తమ ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకున్నా.. ఇంటర్వెల్ సమయంలో మాత్రం వెంటపడిపోయారు.

అందరూ మిల్కీని అడిగింది ఒకటే. ఒకే ఒక్క సెల్ఫీ తీసుకునేందుకు రిక్వెస్ట్ చేశారు. వీటన్నిటినీ సున్నితంగా తిరస్కరించిన మిల్కీ బ్యూటీ.. షో పూర్తయ్యాక ఫోటో సెషన్ పెట్టుకుందామని చెప్పింది. దీంతో సినిమాలో కనిపిస్తున్న దీపికా పదుకొనే కంటే.. షో అయ్యాక తమ్మూతో దిగబోయే సెల్ఫీ గురించే ఊహించుకుంటే టైం గడిపేశారు చాలామంది. తీరా మూవీ కంప్లీట్ అయ్యే సమయానికి సెకండ్ డోర్ నుంచి చెక్కేసింది తమన్నా. ఒక్కరికి కూడా సెల్ఫీ కోరిక తీర్చకుండానే తమ్మూ తుర్రుమంది. నిమిషాల వ్యవధిలోనే జాగ్వర్ లో ప్రసాద్స్ నుంచి వెళ్లిపోయింది.