Begin typing your search above and press return to search.

నాకు ఎప్పుడూ పరీక్షలే -మిల్కీ

By:  Tupaki Desk   |   25 Jun 2015 7:30 AM GMT
నాకు ఎప్పుడూ పరీక్షలే -మిల్కీ
X
ప్రతి ఒక్కరి జీవితంలో ఎస్‌ఎస్‌సి (10వ క్లాసు) ఎంతో కీలకమైనది. అబ్బాయిలకైతే నూనూగు మీసాలు పుట్టుకొచ్చేది అప్పుడే. ఆ తర్వాత కాలేజ్‌లో అడుగుపెట్టా మీసాలు, గుబురు గడ్డాలు పెరుగుతాయి. అదే అమ్మాయిల్లో అయితే పవిట చెంగు సరిచేసుకునే టైమ్‌ స్టార్టవుతుంది. సరిగ్గా ఇలా పవిట సరిజేసుకునే టైమ్‌లోనే తమన్నాకి సినీఛాన్సులొచ్చాయి.

పదో తరగతిలోనే ఈ అమ్మడు హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత కాలేజీ క్యాంపస్‌ జీవితాన్ని ఆన్‌సెట్స్‌లోనే ఆస్వాధించాల్సొచ్చింది. అందుకని తనకి కాలేజ్‌తో పరిచయమే లేదు. హ్యాపీడేస్‌లో కాలేజ్‌ అమ్మాయిగా ఆ జీవితాన్ని అనుభవించి ఫలవరించింది. ఈ సంగతినే తమ్మూ చెబుతూ.. 'నాకు పాఠశాలలో గడిపిన రోజులే గుర్తున్నాయి. కళాశాల గురుతులేం లేవు. అవన్నీ ఆన్‌సెట్స్‌లోనే. చిన్నప్పట్నుంచి హీరోయిన్‌ అవ్వాలని కలలుగనేదాన్ని. ఆ ప్రభావం వల్ల 10లోనే హీరోయిన్‌ అయిపోయా. సినిమానే నాకు విద్యాలయం. కష్టమైన పాత్రలు వచ్చినప్పుడల్లా పరీక్షలు రాసినట్టే ఉంటుంది'' అని చెప్పింది.

అనునిత్యం పరీక్షలు రాస్తూనే ఉన్నా. ఇప్పుడు బాహుబలిలో అలాంటి క్టిష్టమైన పాత్రలోనే నటించా. ఇప్పటివరకూ నటన, డ్యాన్సులే. ఈ సినిమా కోసం ఫైటింగులు కూడా చేశాను. ఇదో కఠినమైన పరీక్ష అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ.