Begin typing your search above and press return to search.

తమన్నాను, చైతూని ఐలాండ్ లో వదిలేస్తే..

By:  Tupaki Desk   |   3 Jan 2016 1:30 PM GMT
తమన్నాను, చైతూని ఐలాండ్ లో వదిలేస్తే..
X
తమన్నాను, చైతూని ఐలాండ్లో వదిలేయడమా.. ఇదేం తుంటరి ఆలోచన అనుకోకండి. ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో భాగంగా ఓ అభిమాని తమన్నాను అడిగిన ప్రశ్న ఇది. అదే జరిగితే అక్కడేం చేస్తారు అని అడిగితే.. చాలా చిత్రమైన సమాధానం ఇచ్చింది మిల్కీ బ్యూటీ. ‘‘ఈ ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ వ్యక్తుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారు. నేను చైతూతో రెండు సినిమాలు చేశాను. కానీ అతను నాతో ఇంతవరకు లంచ్ చేయలేదు. వందసార్లయినా అడిగి ఉంటాను. లంచ్ బ్రేక్ లో ఇద్దరం కలిసి భోంచేద్దాం రా అని. కానీ అతను ఒక్కసారి కూడా రాలేదు. బ్రేక్ దొరికితే అతను నిద్ర పోతుంటాడు. ఒకవేళ మా ఇద్దరినీ ఐలాండ్లో వదిలేస్తే అక్కడ కూడా అతను నిద్ర పోతుంటాడేమో. నేను కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండిపోతా’’ అని చెప్పింది తమ్మూ.

ఇక మీడియాలో తన గురించి రావాలనుకునే రూమర్ ఏంటి అని అడిగితే.. ‘‘నేను అనుకోవడం కాదు కానీ.. ఆ మధ్య ఓ పెద్ద మ్యాగజైన్ లో నా గురించి చిత్రమైన రూమర్ వచ్చింది. నేను అవతార్-2లో నటించబోతున్నానంటూ పండారా గ్రహం మీద ఉండేవాళ్ల లాగే నన్ను బ్లూ కలర్లోకి మార్చేసి ఓ గ్రాఫిక్ చేశారు. అది చూసి చాలా థ్రిల్లయ్యా. ఇది నిజమైతే బాగుంటుంది కదా అనుకున్నా’’ అని తమ్మూ చెప్పింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు నచ్చిన స్టైల్ ఐకాన్ హృతిక్ అన్న టాలీవుడ్ వరకు ఆ విషయంలో ప్రభాస్ నచ్చుతాడని చెప్పింది. కోపం వస్తే ఏం చేస్తావని అడిగితే.. ఎక్కువగా తింటానని ఫన్నీఆన్సర్ ఇచ్చింది తమ్మూ.