Begin typing your search above and press return to search.

కొత్త సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా

By:  Tupaki Desk   |   19 July 2021 5:41 AM GMT
కొత్త సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా
X
వయసు మీద పడిన తర్వాత కూడా మిసమిసలాడే నిగారింపుతో మెరిసిపోవటం అందరికి సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎంత బ్యూటీ అయినా కాలం తీసుకొచ్చే మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. అయితే.. ఇందుకు మినహాయింపుగా కొందరు కనిపిస్తారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా ఒకరుగా చెప్పాలి. తాజాగా ఆమె ఒక పెద్ద సీక్రెట్ ను రివీల్ చేశారు. 31 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పదహారేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పడూ ఒకేలా ఉండటం ఈ సన్నజాబి మొగ్గ స్పెషాలిటీగా చెప్పాలి.

ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో తన సత్తా చాటిన తమన్నా.. తాజాగా ఒక కుకింగ్ షో చేశారు. త్వరలో ఇది ప్రసారం కానుంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు విభిన్నమైన వేదికల మీద తనను తాను ఫ్రూవ్ చేసుకుంటున్న ఆమె.. ఎప్పుడూ ఒకేలా ఉండటం.. ఒకేస్థాయి ఎనర్జీని ప్రదర్శించటం చూసినోళ్లంతా.. ఆమె ఎనర్జీ సీక్రెట్ ఏమిటన్న ఆసక్తి వ్యక్తమవుతుంటుంది. తాజాగా ఆమె తనకు చెందిన టాప్ సీక్రెట్ ను రివీల్ చేశారు.

ఆరోగ్యవంతంగా ఉండేందుకు సెలబ్రిటీలు తరచూ రకరకాల డైట్ ను ఫాలో అవుతుంటారు. అలాంటి ఎన్నో డైట్లు ఫాలో అయినప్పటికీ కనిపించని మార్పు.. తాజాగా తాను చేసిన ఒక డైట్ తనలో మార్పు తీసుకురావటంతోపాటు.. తన ఎనర్జీ లెవెల్స్ ను పెంచాయని చెప్పారు. ఇంతకూ తమన్నా ఫాలో అవుతున్న డైట్ ఏమంటే.. డిన్నర్ కు తర్వాతి రోజు బ్రేక్ ఫాస్ట్ కు పన్నెండు గంటల గ్యాప్ తీసుకోవటం ద్వారా ప్రయోజనం కనిపిస్తుందని చెప్పారు.

‘ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్ మీల్ చేస్తే.. తర్వాతి ఉదయం ఆరు గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసేదాన్ని. అలా చేయటం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. మునపటి కన్నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి’’ అని చెప్పింది. తాను చెప్పిన డైట్ ను అందరూ గుడ్డిగా ఫాలో కావొద్దని స్పష్టం చేస్తోంది. అందరిని తాను పన్నెండు గంటల డైట్ గ్యాప్ ని ఫాలో కావొద్దని చెప్పిన ఆమె.. ఎవరికి వారు వారి ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లు టైమింగ్ ఫాలో కావటం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమన్నా సరికొత్త డైట్ ను ఫాలో అయ్యే ముందు.. ఆమె చేసిన సూచనను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవటం మాత్రం మర్చిపోవద్దు సుమా.