Begin typing your search above and press return to search.
తమ్మూ.. తెలుగుకే స్పెషల్ అంటోంది..
By: Tupaki Desk | 15 March 2016 3:30 PM GMTనాగ్, కార్తీల మల్టీ స్టారర్ మూవీ ఊపిరిలో తమన్నా హీరోయిన్. కార్తీకి జంటగా ఈ చిత్రంలో నటిస్తోంది మిల్కీ బ్యూటీ. ఈ నెల 25న విడుదల కానున్న ఊపిరికి.. ఇప్పుడు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా ఊపిరిలో తన రోల్ గురించి అనేక సంగతులు పంచుకుంటోంది తమ్మూ. మల్టీ మిలియనీర్ కు పర్సనల్ అసిస్టెంట్ అయిన కీర్తిగా నటిస్తున్నానని.. నాగ్ - కార్తీల రోల్స్ కు వారధిగా తన కేరక్టర్ ఉంటుందని చెప్పిన తమ్మూ.. ఈ మూవీ స్టోరీ వినగానే ఎగ్జయిట్ అయ్యానంటోంది.
స్టైలిష్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వంశీ పైడిపల్లి... కీర్తి పాత్ర కోసం ప్రత్యేకమైన లుక్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడటన. సినిమా అంతా టైట్ డ్రస్సులతో కనిపిస్తానని.. స్క్రీన్ పై తన ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పింది మిల్కీ.. అయితే.. ఊపిరి కోసం తొలిసారిగా డబ్బింగ్ చెబ్తోంది తమన్నా. స్టోరీ వరకే కాకుండా.. యాక్టింగ్ చేస్తున్నపుడు కూడా ఒరిజినల్ అనే ఫీలింగ్ కలిగిందట మిల్కీకి. అందుకే తనే ఎందుకు డబ్బింగ్ చెప్పకూడదని ఆలోచించందట కూడా. ఇదే విషయాన్ని దర్శకుడికి చెబ్తే.. ఎంకరేజ్ చేయడంతో.. డబ్బింగ్ చెప్పానని మిల్కీ అంటోంది.
అయితే.. ఇలా తన స్వరం వినిపించింది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే అంటోంది మిల్కీ బ్యూటీ. తమిళంలో తన వెర్షన్ కి వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారని వివరించింది. అంతే కాదు.. భవిష్యత్ లో కూడా తన తెలుగు సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పే యోచనలో ఉందిట తమ్మూ.