Begin typing your search above and press return to search.

నేనింకా స్కూల్ పిల్లనే అనుకుంటోందా?

By:  Tupaki Desk   |   24 Sept 2015 5:30 PM
నేనింకా స్కూల్ పిల్లనే అనుకుంటోందా?
X
మిల్కీ బ్యూటీ - తెల్లతోలు పిల్ల - తమ్మూ.. ఇలా రకరకాల ముద్దు పేర్లతో పిలుచుకోడానికి సరిగ్గా సరిపోతుంది తమన్నా. ఫ్యాషన్ ఫాలో అవడం, ట్రెండ్ కి తగ్గట్టుగా డ్రసప్ అవడంలో తమ్మూ తర్వాతే ఎవరైనా. ఎక్కడ ఏమేం ఉండాలో అన్నీ సరిగ్గా ఉండే ఈ సుందరి.. ఎక్కడకి ఎలా రెడీ అవ్వాలో, ఏ రేంజ్ లో డ్రసప్ అవ్వాలో అలా వెళ్లిపోతూ ఉంటుంది.

తాజాగా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సరిగమప లిటిల్ ఛాంప్స్ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీని జడ్జ్ గా పిలిచారు. అసలే ఇది చిన్నపిల్లల ప్రోగ్రాం.. ఈ కార్యక్రమానికి తమ్మూ వేసుకొచ్చిన డ్రస్ చూసి.. హోస్ట్ - జడ్జ్ లకు మతిపోయింది. స్కూల్ పిల్ల మాదిరిగా బ్లాక్ షర్ట్ - కార్టూన్ స్కర్ట్ వేసుకుని వచ్చేసింది తమన్నా. పిల్లల కార్యక్రమంలో ఇలా గ్లామర్ ఒలకబోయడంతో.. సెటైర్లు బాగానే పడ్డాయి.

అయితే తమన్నా హీరోయిన్ గా ఓ రేంజ్ ని వెలగబెట్టేస్తోంది కానీ.. అమ్మడి ఏజ్ ఇంకా పట్టుమని పాతికేళ్లే. పదిహేనేళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసరికి సీనియర్ అయిపోయిందంతే. అదే ఏ మేనేజ్మంట్ స్టడీస్ లోనో ఉండుంటే.. ఇంకా కెరీర్ బిల్డింగ్ లోనే ఉండేది కదా. దానికి తోడు స్కూల్, కాలేజ్ కి సరిగా వెళ్లలేకపోయానని ఓపెన్ గానే ఫీలవుతూ ఉంటుంది. అందుకే.. అవకాశం రాగానే స్కూల్ పిల్లలా రెడీ అయిపోయి వచ్చేసుంటుంది. అర్ధం చేసుకోరూ?