Begin typing your search above and press return to search.

17ఏళ్లకే కన్యత్వాన్ని పోగొట్టుకున్నా: తమన్నా

By:  Tupaki Desk   |   5 Sept 2019 5:09 PM IST
17ఏళ్లకే కన్యత్వాన్ని పోగొట్టుకున్నా: తమన్నా
X
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి. ఆ తర్వాత బిగ్ బాస్ 3లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసింది. హౌస్ లో తన బోల్డ్ మాటలతో విసిగించి వెగటు పుట్టించింది. బుల్లితెర యాక్టర్ రవిని ఈమె హింసించడంతో ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారు.

ఈ షో నుంచి బయటకు వచ్చాక తమన్నా తన ఫ్యూచర్ ప్లానేంటో వివిధ చానెల్స్ తిరుగుతూ చెప్పుకొస్తోంది. బిగ్ బాస్ లోని సంగతులతోపాటు తన పర్సనల్ విషయాలను పూసగుచ్చినట్టు వివరిస్తోంది.

తాజాగా తమన్నా సింహాద్రి చేసిన బోల్డ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఓ చానెల్ కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు వర్జినేనా అని యాంకర్ ప్రశ్నించగా కుండబద్దలు కొట్టింది. ‘తాను వర్జిన్ కాదని.. అబద్ధాలు చెప్పడం రాదని’ స్పష్టం చేసింది. ‘సల్మాన్ ఖాన్ వర్జినా..? నేను కూడా అంతే’ అంటూ మొహమాట పడకుండా చెప్పేసింది. తన 17వ ఏటనే కన్యత్వాన్ని పోగొట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. నా శరీరం వర్జిన్ కాకపోయినా.. మనసు మాత్రం వర్జినే అంటూ చివర్లో కొసమెరుపు ఇచ్చింది.

ఇక తన ఫ్యూచర్ సినిమాల మీదనే ఉందని.. సినిమాల్లో నటించి ఆ తర్వాత రాజకీయ నేతగా మారుతానని వివరణ ఇచ్చింది.