Begin typing your search above and press return to search.
తమన్నా.. పాలిటిక్స్ లో బిగ్ బాస్
By: Tupaki Desk | 4 Aug 2019 6:42 AM GMTతమన్నా రాజకీయాల్లోకి వచ్చేస్తోంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఏంటి.? రాజకీయాల్లోకి రావడమేంటన్న సందేహాలు కలగడం సహజం. అయితే రాజకీయాల్లోకి వచ్చేది హీరోయిన్ తమన్నా కాదు.. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి. ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తమన్నా అసలు టార్గెట్ బిగ్ బాస్ కాదని.. ఆమె రాజకీయాల్లో చేరడానికే బిగ్ బాస్ పాపులారిటీని ఉపయోగించుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తమన్నాకు రాజకీయాలు కొత్త కాదు.. ఈమె అసలు పేరు సింహాద్రి మస్తాన్. తండ్రి రైతు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణకు చాలా దగ్గర బంధువు తమన్నా సింహాద్రి. కానీ ట్రాన్స్ జెండర్ గా మారాక తమన్నా గా పేరు మార్చుకున్నారు. గతంలో విజయవాడలో వంగవీటి రాధా విగ్రహం విషయంలో ఆందోళన చేసి తొలిసారి వార్తల్లో నిలిచారు. వివాదాస్పద నటి శ్రీరెడ్డికి అండగా నిలిచి ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఈ క్రమంలోనే తన పాపులారిటీని పెంచుకొని ఫుల్ టైం రాజకీయాల్లో మనుగడ సాగించుకునేందుకు బిగ్ బాస్ ను వేదికగా తమన్నా ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ తో తెలుగు ప్రజలందరికీ సుపరిచితం కావచ్చు. అందులో వచ్చిన పేరుతో పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రావాలని డిసైడ్ అయ్యిందట.. బిగ్ బాస్ ఇమేజ్ ను పొలిటికల్ స్క్రీన్ మీద వాడుకోవాలని భావిస్తోందట..
లోకేష్ మీద పోటీచేసి టీడీపీకి శతృవుగా మారిన తమన్నా ఇప్పుడు బీజేపీ - వైసీపీ - జనసేనల్లో ఏదీ పార్టీలో చేరి రాజకీయంగా బలపడేందుకే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ వ్యూహరచన చేశారని సమాచారం. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే రాజకీయాల్లో చేరి పొలిటీషియన్ గా సెటిల్ అయిపోవాలన్నది ఆమె ఆలోచనగా చెబుతున్నారు.