Begin typing your search above and press return to search.
తమన్నా సక్సెస్ అయితే మరింత మంది క్యూ కట్టే ఛాన్స్
By: Tupaki Desk | 24 March 2021 4:30 AM GMTలాక్ డౌన్ సమయంలో ఇండియాలో అనూహ్యంగా ఓటీటీ బిజినెస్ పెరిగింది. దాదాపు పది నెలల పాటు సినిమాలు లేకపోవడంతో ప్రేక్షుకలు వినోదం కోసం ఓటీటీని ఆశ్రయించారు. మళ్లీ థియేటర్లు కళకళలాడుతున్నా ఓటీటీటీకు మాత్రం డిమాండ్ తగ్గలేదు అనేది కొందరి మాట. అందుకే హీరోలు మరియు హీరోయిన్స్ కూడా ఓటీటీ పై ఆసక్తి చూపిస్తున్నారు.
కాజల్ ఇటీవలే 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆ వెబ్ సిరీస్ నిరాశ పర్చింది. కాజల్ వెబ్ సిరీస్ విషయంలో చెదు ఫలితం ఎదురవ్వడంతో ఇతరులు వెబ్ కంటెంట్ వైపు వెళ్లేందుకు కాస్త వెనుక ముందు ఆడుతున్నారు. ఇలాంటి సమయంలో తమన్నా నటించిన 11త్ అవర్ వెబ్ సిరీస్ ఆహా లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.
ఆహా వారు కొన్ని నెలల క్రితమే ఈ వెబ్ సిరీస్ ను ప్రకటించారు. కాని వరుసగా ఏదో ఒక కంటెంట్ స్ట్రీమింగ్ ఉండటం వల్ల తమన్నా వెబ్ సిరీస్ ను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఏప్రిల్ 9వ తారీకున 11త్ అవర్ ను స్ట్రీమింగ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించడంతో పాటు తమన్నా అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చే విధంగా వెబ్ సిరీస్ ఉంటుందని మేకర్స్ అంటున్నారు. కాజల్ నిరుత్సాహ పర్చినా తమన్నా ఒక వేళ సక్సెస్ అయితే మరింత మంది హీరోయిన్స్ మరియు హీరోలు కూడా వెబ్ సిరీస్ లకు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమాల్లో ఈమద్య కాలంలో డల్ అయిన తమన్నా ఈ వెబ్ సిరీస్ తో మళ్లీ స్పీడ్ పెంచుతుందేమో చూడాలి.