Begin typing your search above and press return to search.
తమ్మూ వెంటపడుతున్న పెద్దాయన
By: Tupaki Desk | 28 Oct 2015 5:20 AM GMTఒక అందమైన అమ్మాయి.. ఆ అమ్మాయి వెంట పడుతున్న ఓ 50 వయసు పెద్దాయన. ఇదేమి ఛోద్యం? అని అనిపించవచ్చు. కానీ ఇది పక్కాగా నిజం. ఈ ఎపిసోడ్ లో ఆ అందాల భరిణె మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. ఈవిడ వెంటపడుతున్న పెద్దాయన పేరు విజయ్ కాంత్. కోలీవుడ్ లో సీనియర్ హీరో. అసలు ఈ పెద్దాయన మిల్కీ వెంట ఎందుకు పడాల్సొచ్చింది.. చెక్ డీటెయిల్స్.
90లలో కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో తెలుగులోనూ పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ కాంత్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఇన్ స్పిరేషన్ తో తెరకెక్కిన కెప్టెన్ ప్రభాకర్ 90లలో పెద్ద హిట్టు సినిమా. అందుకే విజయ్‌కాంత్ అనే హీరోని కోలీవుడ్ - టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. పైగా విజయ్ కాంత్ తమిళనాట ఓ బలమైన రాజకీయనేతగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు. ఇప్పుడు రాజకీయాల్ని మించి కొడుకును హీరోని చేసేందుకు కృషి చేస్తున్నాడు.
ఇప్పటికే తనయుడు షణ్ముగ పాండ్యన్ ని స్టార్ ని చేసేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఇందులో తొలిప్రయత్నం విఫలమైంది. దాంతో రెండో ప్రయత్నం చాలా తెలివిగా ఉండాలని పట్టుపడుతున్నాడు. అసలే శ్రీకృష్ణుని అంశతో వచ్చిన రంగు.. దాంతో కొడుకును హీరోని చేయడం అంటే అతడిముందు చాలా సవాళ్లే నిలిచి ఉన్నాయి. మొదటి ప్రయత్నం షణ్ముగంని హీరోగా అంగీకరించడానికి తంబీల మనసు అంగీకరించలేదు. అందుకే ఇక ఎట్టి పరిస్థితుల్లో షణ్ముగం సరసన ఓ క్రేజీ హరోయిన్ అయితే బావుంటుందని విజయ్ కాంత్ భావించి మిల్కీవైట్ బ్యూటీ వెంటపడుతున్నాడు. ఎలాగైనా జాతీయ స్థాయిలో క్రేజు సంపాదించుకున్న (బాహుబలితో) తమన్నా అయితే షణ్ముగంకి ప్లస్ అవుతుందని ప్లాన్ చేస్తున్నాడు.
కథాంశం పరంగానూ చాలా జాగ్రత్త తీసుకుని హిస్టారికల్ నేపథ్యం ఎంచుకున్నారు. అంతగా హీరోయిక్ అప్పీల్ లేకపోయినా ఉదయనిధి స్టాలిన్ స్టార్ హీరోయిన్ల అండతో ఎలా నెట్టుకొచ్చేశాడో అదే తీరుగా తన కొడుకు కూడా ప్రమోట్ అవుతాడన్నది విజయ్ కాంత్ ప్లానింగ్. అందుకే కోటిన్నర పారితోషికం ముట్టచెప్పి అయినా మిల్కీని లైన్ లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడుట. ఇప్పుడర్థమైందా?