Begin typing your search above and press return to search.
ఇక్కడ కోట్లన్నీ అక్కడ పోస్తావా తమ్ము?
By: Tupaki Desk | 3 Oct 2016 3:30 PM GMTతమిళంలో హీరోయిన్లు ఎంత రేంజుకు వచ్చినా కూడా అక్కడిచ్చే రెమ్యూనరేషన్ మాత్రం బాగా తక్కువే. అదే తెలుగులో అయితే వరుసగా రెండు హిట్లు పడి ఎవరైనా పెద్ద హీరో సైన్ చేస్తే చాలు.. వెంటనే కోట్లలో పేమెంట్ ఉంటుంది. ఆ విధంగా మిల్కీ బ్యూటి తమన్నా వంటి భామలు టాలీవుడ్ బ్లెస్సింగ్స్ తో కోట్లకు పడగలెత్తేశారు.
ఇకపోతే తెలుగులో తొలుత 'శ్రీ' సినిమాను చేసిన తమన్నా.. ఆ తరువాత టాలీవుడ్లో బ్రేక్ రాకపోవడంతో తమిళం చెక్కేసింది. తిరిగి హ్యాపీ డేస్ పడే వరకు అమ్మడికి ఇక్కడ బ్రేక్ లేదు. అయితే తొలినాళ్ళలో తమిళంలో చేసిన సినిమాల కారణంగా అమ్మడికి నటిగా మాంచి గుర్తింపు వచ్చిందట. అందుకు తమిళ ప్రజల ఋణం తీర్చుకోవడానికి అమ్మడు రెడీగా ఉందట. త్వరలోనే తమిళంలో సినిమాలు నిర్మించడం మొదలెట్టాలని తమన్నా ప్లాన్ చేస్తున్నట్లు సెలవిచ్చింది. కేవలం అభినేత్రి సినిమా రిలీజ్ సందర్భంగా ఇలా హస్క్ వేస్తున్నారా అంటే.. అబ్బే కాదు.. నిజంగానే తమిళంలో ప్రొడ్యూస్ చేస్తా అంటోంది అమ్మడు.
బాగానే ఉంది కాని.. అసలు కోట్ల రూపాయలు పేమెంట్లు ఇచ్చి అమ్మడిని ఈ రేంజు స్టార్ ను చేసింది తెలుగు ప్రేక్షకులు కదా.. మరి ఇక్కడ సినిమాలు తీయదా? ఓహ్.. తమిళంలో తీసి వాటి డబ్బింగ్ వర్షెన్ మనకు డొనేట్ చేస్తుందేమోలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/