Begin typing your search above and press return to search.

ఆ బయోపిక్ మీద మిల్కీ బ్యూటీ కన్ను

By:  Tupaki Desk   |   7 March 2019 10:02 AM IST
ఆ బయోపిక్ మీద మిల్కీ బ్యూటీ కన్ను
X
మహానటి బయోపిక్ విజయం ఒకరమైన స్పూర్తిని ఇస్తే ఎన్టీఆర్ రెండు భాగాల ఫలితాలు మరో రకమైన భయాన్ని హెచ్చరికను జారీ చేశాయి. ఎంత గొప్ప నటుల కథలైనా ఎంత పెద్ద స్టార్లు నటించినా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడకుండా కేవలం హంగులకు ప్రాధాన్యం ఇస్తే ప్రేక్షకులు ఎంత దారుణంగా తిరస్కరిస్తారో బాక్స్ ఆఫీస్ సాక్షిగా రుజువయ్యింది. అందుకే ఇకపై ఎవరి బయోపిక్ తీయాలన్నా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోక తప్పదు.

సావిత్రిది అయిపోయింది కాబట్టి ఇదే తరహాలో శ్రీదేవి జీవితం కూడా వెండితెరపై వస్తే బాగుండు అనుకుంటున్న ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. బోనీ కపూర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు టాక్ కూడా వచ్చింది. ఒకవేళ అది కార్యాచరణలోకి వస్తే వెంటనే తాను రంగంలోకి దూకుతాను అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా

ఇటీవలే ఓ ప్రైవేటు టెక్స్ టైల్ బ్రాండింగ్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నా మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఎవరైనా శ్రీదేవి బయోపిక్ తీస్తున్నారని తెలిస్తే వెంటనే వెతికి పట్టుకుని నాకో వేషం ఇమ్మని అడుగుతానని తానెంతో అభిమానించే నటి కథ తెరకెక్కుతున్నప్పుడు అందులో భాగం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది.

అయితే తమన్నా ఆశిస్తోంది శ్రీదేవి రోలా లేక అందులో చిన్న క్యామియోనా క్లారిటీ లేదు కాని మొత్తానికైతే మనసులో మాట బయట పెట్టుకుంది. చాలా కాలం నుంచి ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న తమన్నాకు ఎఫ్2 బ్లాక్ బస్టర్ సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇదే ఏడాది సైరా కూడా వస్తుండటంతో ఆనందం మాములుగా లేదు, బాహుబలి తర్వాత అంత పెద్ద బ్రేక్ వచ్చింది ఎఫ్2తోనే మరి. ఇప్పుడిది నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆఫర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోందట