Begin typing your search above and press return to search.

డైనసార్లతో తమన్నా ఆడుకోనుందట

By:  Tupaki Desk   |   27 Feb 2018 7:13 AM GMT
డైనసార్లతో తమన్నా ఆడుకోనుందట
X
సౌత్ హాట్ బ్యూటీ తమన్నా తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించింది కానీ ఏ పాత్ర కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్టు అందుకోలేదు. అందంలో తమన్నా మంచి మార్కులే కొట్టేసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య మాత్రం ఐరెన్ లెగ్ అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ ని భాగానే అందుకుంది. అలా అని అవకాశాలు తగ్గలేదు. ఎదో విధంగా ఆఫర్స్ అందుకుంటూనే ఉంది. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో కూడా భాగమైంది. అంతే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే.. సమంత రీసెంట్ గా ఒక భారీ ఆఫర్ ని అందుకుందని బాలీవుడ్ లో టాక్ ఓ రేంజ్ లో వస్తోంది. బాహుబలి తరువాత నార్త్ మీడియా సౌత్ పై చాలా ఏకాగ్రత పెంచేసింది. ఏ మాత్రం చిన్న న్యూస్ అందినా అక్కడ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇకపోతే తమన్నా ఒక డైనోసర్స్ తరహాలో ఉండే సినిమాల్లో నటించడానికి ఒకే చెప్పిందట. తమన్నా చాలా కీలకమైన రోల్ కి సెలెక్ట్ అయ్యిందని తెలుస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ కూడా సినిమా యూనిట్ తో కలవనున్నట్లు సమాచారం. అంటే అందరూ కలసి డైనోసార్లతో ఆడుకోనున్నారనమాట.

బాహుబలి కంటే ఉన్నత స్థాయిలో ఈ సినిమాను తెరకెకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. తమన్నా కి సౌత్ లో పెద్దగా అవకాశాలు అందడం లేదు. కానీ బాలీవుడ్ లో అమ్మడు ఏకంగా ఒక డైనోసర్ వంటి సినిమాల్లో నటించడం ఏంటని కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఆ విషయం ఎంత వరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం తమన్నా కళ్యణ్ రామ్ నా నువ్వే సినిమాను అలాగే సందీప్ కిషన్ తో ఒక సినిమాకు కమిటీ అయ్యి ఉంది.