Begin typing your search above and press return to search.

బేఫిక్రాతో మిల్కీబ్యూటీ రచ్చ

By:  Tupaki Desk   |   9 Dec 2016 3:30 PM GMT
బేఫిక్రాతో మిల్కీబ్యూటీ రచ్చ
X
ఎంతైనా బాలీవుడ్ కున్న క్రేజే వేరు. నిజంగా ఎఫెక్షన్ ఉంటుందో.. లేకపోతే ఏదైనా ఆఫర్ ఇవ్వకపోతారా అని కనిపించిన వాళ్లందరికీ బట్టర్ పూస్తారో గానీ ఒక్కసారి పరిచయమైతే చాలు లైఫ్ టైమ్ ఫ్రెండ్స్ అన్నట్టు భలే బిల్డప్స్ ఇస్తుంటారు ఒక్కొక్కళ్లు. ఇక సినిమా ప్రమోషన్స్ టైంలో అయితే ఫెవికాల్ పూసేసినట్టు అతుక్కోని మరీ పోజులు కూడా ఇస్తుంటారు. రణవీర్ సింగ్- తమన్నా దిగిన ఫోటో చూస్తే ఇప్పుడు చాలామందికి ఇలాంటి ఫీలింగే వస్తోంది.

బేఫికర్ మూవీ రిలీజ్ ఉండటంతో సినిమాని ప్రమోట్ చేయడానికి కాళ్లకు చక్రాలు కట్టుకోని దేశమంతా తిరిగేస్తున్నాడు హీరో రణవీర్ సింగ్. తన మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు వదులుకోడు ఈ హైపర్ యాక్టివ్ హీరో. రాందేవ్ బాబా లాంటి వాళ్లనే వాడేసుకోన్నాడు అలాంటిది తమన్నా కనిపిస్తే ఆగుతాడా..? పైగా ఇద్దరూ కలిసి చింగ్ రిటర్న్స్ అంటూ యాడ్ కి ఎక్కువ.. షార్ట్ ఫిల్మ్ కి తక్కువ అన్నట్టుండే ఓ వీడియోలో కలిసి యాక్ట్ చేశారు. అప్పుడు స్టార్టైన ఫ్రెండ్షిప్ స్టిల్ కంటిన్యూస్. అంతే ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లో తమన్నా కూడా ఓ హ్యాండేసింది.

ఈ బేఫిక్రా పక్కనుంటే అసలు లోకమే తెలీదు. ఆ క్రేజ్ ను తట్టుకోవడం ఎవరి వల్లా కాదు బాబూ అంటూ రణవీర్ మీద పొగడ్తలు కురిపించేసింది. అంతేనా నేను బేఫికర్ కు వెళ్తున్నానోచ్ అంటూ టికెట్స్ కూడా పోస్ట్ చేసి రణవీర్ మూవీకి ఇండైరెక్ట్ గా తన వంతు పబ్లిసిటీ చేసేసింది. తన సోషల్ సైట్ పేజీల్లో మనీ తీసుకోని మాత్రమే ఏదైనా ఎండార్స్ చేసే తమన్నా రణవీర్ కోసం రూల్ ని పక్కనబెట్టిందంటే వీళ్లది ఎంత థిక్క్ ఫ్రెండ్షిప్పో అర్థం చేసుకోవచ్చు. ఎంతైనా రణవీర్ తెలివిని ఒప్పుకోవాల్సిందే. ఓ ఫోటోకి స్టిల్ ఇచ్చి చక్కగా తన మూవీని పబ్లిసిటీ చేసుకొంటున్నాడు.