Begin typing your search above and press return to search.

తమన్నాకి తిరుగుడు ఎక్కువైపోయింది

By:  Tupaki Desk   |   25 Sept 2016 10:03 AM IST
తమన్నాకి తిరుగుడు ఎక్కువైపోయింది
X
మిల్కీ బ్యూటీ తమన్నా సడెన్ గా మహా బిజీ అయిపోయింది. కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాలు.. కావాల్సినన్ని హిట్స్ ఉన్నా.. గత కొంతకాలంగా బాక్సాఫీస్ దగ్గర తమ్మూ సినిమాల పరిస్థితి పెద్ద గొప్పగా ఉండడం లేదు. ఇలాంటి సమయంలో తనకు వచ్చిన వాటిలో క్రేజీ ఆఫర్స్ ను మిల్కీ ఏ మాత్రం వదలడం లేదు. చివరకు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో ఐటెమ్ సాంగ్ కు వచ్చిన ఆఫర్స్ ను కూడా పక్కాగా ఉపయోగించేసుకుంటోంది.

నిఖిల్ కుమార్ గౌడ నటించిన జాగ్వార్ మూవీని కన్నడంతో పాటు తెలుగు-తమిళ్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 7న జాగ్వార్ విడుదల కానుండగా.. ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది. హైద్రాబాద్ లో రీసెంట్ గా ఈ పాటను పిక్చరైచ్ చేయగా... రిలీజ్ డేట్ మరో రెండు వారాలే ఉండడంతో.. ఈ పాట షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసేందుకు తమన్నా బాగానే కష్టపడాల్సి వచ్చింది. పైగా ఇదే సమయంలో తమ్మూ నటించిన అభినేత్రికి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అమ్మడిపై మరో బాధ్యత కూడా ఉంది.

బాలీవుడ్ లో టూటక్ టూటక్ టూటియా టైటిల్ తోను.. తెలుగులో అభినేత్రి.. తమిళ్ లో దెవి(ల్) పేరుతోను ఈ చిత్రం విడుదల కానుండగా.. అన్ని ఏరియాల్లో ప్రచారం చేసేందుకు ట్రై చేస్తోంది మిల్కీ. దీంతో ముంబై- చెన్నై- హైద్రబాద్ ల మధ్య తెరిగేయాల్సి వస్తోంది. మరి సినిమాలు హిట్టైతే.. ఈ కష్టం అంతా అలా మర్చిపోతుంది తమన్నా.