Begin typing your search above and press return to search.

'దాన్ని ఏ కోణంలో సెట్ చేయాలి' అంటున్న మిల్కీ బ్యూటీ

By:  Tupaki Desk   |   12 April 2020 4:53 AM GMT
దాన్ని ఏ కోణంలో సెట్ చేయాలి అంటున్న మిల్కీ బ్యూటీ
X
కరోనా వైరస్ ప్రజల దైనందిక జీవితాలపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ప్రజల ధన, ప్రాణ నష్టాలకు గురిచేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత, సామజిక దూరం పాటిస్తూ ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు. ఇప్పటికే మాల్స్, థియేటర్స్, షూటింగ్స్ రద్దు చేశారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్న విషయం తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా గృహ నిర్బంధ సమయంలో ఫిట్ నెస్ కై చేసిన యోగాసనాల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ట్రైనర్ పర్యవేక్షణలో ఫిట్నెస్ ప్రయోగాలు చేస్తోందట. అయితే లాక్ డౌన్ లో ఉన్న కారణంగా తమన్నా తనకు సంబంధించిన అన్నీ విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. వర్క్ అవుట్ వీడియో తీసేటప్పుడు ఫోన్ ని సరైన కోణంలో పెడితే పర్యవేక్షించే ట్రైనర్ ట్రైన్ చేయడానికి సరైన ఆస్కారం ఉంటుంది.

కానీ మిల్కీ బ్యూటీకి తన మొబైల్ సరైన కోణంలో పెట్టడమే పెద్ద సవాల్ అయ్యిందట. నేను ట్రైనింగ్ వీడియోలో ఉన్నప్పుడు ఫోన్ ఊరికే పడిపోతుంది. పడకుండా ఎలా ఆపాలి అని ఆలోచిస్తుంటే.. నాకు టిష్యూ పేపర్ల బాక్స్, డ్రై ఫ్రూట్స్ ట్రే మొబైల్ సెట్ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయట. ఈ విధంగా తమన్నా ఇంస్టాగ్రామ్ లో తన వర్క్ అవుట్ సంబంధించి వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతున్న "సీటీ మార్ " మూవీలో నటిస్తుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "క్వీన్" మూవీ తెలుగు రీమేక్ తమన్నా హీరోయిన్ గా రూపొందిన "దటీజ్ మహాలక్ష్మి" మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంకా బాలీవుడ్ మూవీ "బోలే చూడియాన్"లో నటిస్తుంది.