Begin typing your search above and press return to search.

తమన్నా రాక్షస ప్రయత్నం ఫలించేనా?

By:  Tupaki Desk   |   19 Jan 2023 3:46 PM GMT
తమన్నా రాక్షస ప్రయత్నం ఫలించేనా?
X
మిల్కీ బ్యూటీ తమన్నా శ్రీ అనే సినిమాతో మంచు మనోజ్ సరసన హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాక బడా హీరోలు పక్కన కూడా మెరిసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, పవన్‌కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో నటించిన ఈ భామకు ఇప్పుడు అవకాశాలే కరువయ్యాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆఖరికి సత్యదేవ్‌ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల పక్కన కూడా ఆమె హీరోయిన్‌గా నటించడానికి సై అంటుందంటే... ఆమె ఎంతలా అవకాశాల కోసం ఎదురుచూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే అలాంటి తమన్నకి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ లాంటి సినిమా దొరికిందనే చెప్పాలి. అదే జైలర్ అనే సినిమా. రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని భారీ లెవెల్‌లో నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద దయా నిధి మారం ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివా రాజ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమాని పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం ఖాయం అని అంటున్నారు.

తెలుగు నుంచి సునీల్‌ని కూడా ఈ సినిమాలో భాగం చేశారు. సినిమా నుంచి విడుదల చేసిన సునీల్ ఫస్ట్ లుక్‌లో మంగళం శీను లాగా అనిపిస్తుంది. దీనితోసునీల్ విలన్ పాత్రధారిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు అదే సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. తమన్నా ఫస్ట్ లుక్ పెద్దగా ఆశ్చర్యపరిచే విధంగా ఏమీ లేకపోయినా... ఒక రకంగా ఇది ఆమెకు కీలక అవకాశం అనే చెప్పాలి.

ఎందుకంటే ఆమెకు వరుస అవకాశాలు అయితే దొరకడం లేదు. దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ... ఏమాత్రం జారవిడుచుకోకుండా ఆమె సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ సినిమా ఒకరకంగా ఆమెకి లాస్ట్ ఛాన్స్ అనే ప్రచారం కూడా ఉంది.

ఎందుకంటే ఇప్పటికే ఆమె విజయవర్మ అనే నటుడితో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ మీడియా కంటపడింది. ఒకవేళ ఈ సినిమా తేడా పడితే ఇక మీకు పెళ్లి తప్ప మరో దారి లేదని సినీ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. జైలర్ సినిమా అయినా తమన్నాను నిలబెడుతుందా లేక రొటీన్ సినిమాగా మారి ఇబ్బంది పెడుతుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.