Begin typing your search above and press return to search.
ఒకేసారి ఒకే సమయంలో ఇద్దరు హీరోలు పొగడ్తలు!
By: Tupaki Desk | 15 Sep 2021 5:33 AM GMTఒంటి చేత్తో పది పనులు చక్కబెట్టడంలోనే కాదు.. ఒకే సమయంలో రెండు ప్రెస్ మీట్లు మ్యానేజ్ చేయడంలోనూ సవ్యసాచిలా నేర్పరితనం చూపించింది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. ఇంత బిజీలో నాకెందుకులే అనుకునే బాపతు తత్వానికి భిన్నంగా తమన్నా తన సినిమా ప్రచార బాధ్యత తనకే ఉంది! అన్న తీరుగా ప్రవర్తించి అందరినీ మురిపించింది. అసలు సినిమా ప్రచారానికి వచ్చేందుకు అంగీకరించని కథానాయికలు ఉన్న చోట తమన్నా నేర్పరితనం మంచితనం ప్రశంసలందుకుంది. వివరాల్లోకి వెళితే..
తనదైన అందం నటనతో రెండు దశాబ్ధాలుగా మెరిపిస్తున్న మిల్కీ వైట్ బ్యూటీ ఇటీవల వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమన్నా మంచి నటిగా డ్యాన్సర్ గా మాత్రమే కాదు.. అన్నింటికన్నా గొప్ప ప్రొఫెషనల్. చేసే పనిలో నిబద్ధతను అలాగే తన పని తీరును తరచుగా స్టార్ హీరోలు కూడా ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి సవ్యసాచిలా రెండు సినిమాల ప్రమోషన్స్ కి ఎటెండై ఆశ్చర్యపరిచింది.
`మాస్ట్రో` బృందం ఓ వైపు సీటీమార్ బృందం మరోవైపు నిన్న సాయంత్రం ఒకే సమయంలో ప్రచార వేదికలను నిర్వహించాయి. ఈ రెండు సినిమాల్లో తమన్నా హీరోయిన్ కాగా తను ఏ ఈవెంట్ లో పాల్గొంటుందో అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఇక్కడే తన నిబద్ధత ఏంటో ప్రూవ్ అయ్యింది. మిల్కీ మొదట మాస్ట్రో ఈవెంట్ లో పాల్గొంది. ఆపై సీటీమార్ ఈవెంట్ కు వెళ్లింది. అన్నిచోట్లా తన సినిమాలను ప్రమోట్ చేసింది. ఒకరికి ప్రచారం ఒకరికి అన్యాయం చేయకుండా బ్యాలెన్స్ చేసింది తమన్నా. తన రెండు సినిమాలకు ఆమె వృత్తి నైపుణ్యాన్ని నిబద్ధతను జోడించి అందరినీ మెప్పించింది.
ఇప్పుడు ఒకేసారి ఒకే సమయంలో ఇద్దరు హీరోల ప్రశంసలు అందుకుంది తమన్నా. అంధాధున్ సినిమాలో టబు పోషించిన పాత్రను ధైర్యంగా ఎంచుకున్నందుకు తమన్నాని మాస్ట్రో ప్రచార వేదికపై కథానాయకుడు నితిన్ ప్రశంసించగా.. పాటల్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు తనకు చెమటలు పట్టేలా చేసిన ప్రతిభావంతులు అంటూ గోపీచంద్ తమన్నాని ప్రశంసించారు. ఇంతకుముందు సైరా ప్రచార వేదికపై మిల్కీ వైట్ బ్యూటీ ప్రతిభను మెగాస్టార్ ప్రశంసించిన సంగతి తెలిసిందే.