Begin typing your search above and press return to search.

భోళా శంకర్‌లో వకీల్ సాబ్ రచ్చ

By:  Tupaki Desk   |   10 May 2023 4:00 PM GMT
భోళా శంకర్‌లో వకీల్ సాబ్ రచ్చ
X
సినిమాల్లో కమ్‌బ్యాక్ అయిన తర్వాత నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే చాలా సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడంతో పాటు తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. దీనికితోడు 'వాల్తేరు వీరయ్య' హిట్‌తో జోష్‌లో ఉన్న చిరు.. ఇప్పుడు 'భోళా శంకర్' అనే మూవీ చేస్తోన్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన 'వేదాళం' మూవీకి రీమేక్‌గా వస్తున్న సినిమానే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. ఇప్పుడు కోల్‌కతాలో కీలకమైన షెడ్యూల్ జరుగుతోంది.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె ఓ ఫేమస్ లాయర్ పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా బయటకు వచ్చేశాయి. ప్రస్తుతం కోల్‌కతా షెడ్యూల్‌లో ఆమెపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. 'భోళా శంకర్' సినిమాలో తమన్నా భాటియా కోర్టు సన్నివేశాల్లో 'వకీల్ సాబ్' మూవీలోని పవన్ కల్యాన్ బాడీ లాంగ్వేజ్‌ను అనుకరించబోతుందని తెలిసింది. అంతేకాదు, 'అబ్జెక్షన్ అబ్జెక్షన్' అంటూ డైలాగులు కూడా చెప్పబోతుందట. ఈ సీన్స్ అన్నీ హిల్లీరియస్‌గా వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ కాబోతుందని టాక్.

'భోళా శంకర్' మూవీ సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఓ కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక, ఇందులో మెగాస్టార్ కోల్‌కతాలో నివసించే ఓ ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తోన్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.