Begin typing your search above and press return to search.
మిల్కీ బ్యూటీ రెమ్యునరేషన్ ఇంతలా పెంచిందేంటబ్బా?!
By: Tupaki Desk | 19 Feb 2022 7:33 AM GMTఇటు టాలీవుడ్ .. అటు బాలీవుడ్ .. ఈ మధ్యలో కోలీవుడ్ లో తమన్నాకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక చిన్న సినిమాతో కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తమన్నా, అంచలంచెలుగా ఎదుగుతూ పాప్యులర్ అయింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవడానికీ .. అడుగుపెట్టిన ప్రతి భాషలోనూ అదుర్స్ అనిపించుకోవడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకోలేదు.
తమన్నా మంచి అందగత్తె .. ప్రత్యేకమైన ఆకర్షణ ఆమె మేనిఛాయ. అలాంటి స్కిన్ టోన్ ఉన్న కథానాయిక తెరపైకి ఇంతవరకూ రాలేదు. అంతమంచి రొమాంటిక్ డాన్సర్ కూడా ఇంతవరకూ రాలేదు.
ఒకప్పుడు డాన్స్ పరంగా చిరంజీవి స్పీడ్ ను అందుకునే కథానాయికలుగా విజయశాంతి .. రాధ .. భానుప్రియ పేర్లు వినిపించేవి. కానీ తమన్నా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇంతవరకూ ఆమె పేరు మాత్రమే వినిపిస్తోంది. కొత్త కథానాయికల వలన ఆమెకి అవకాశాలు తగ్గినప్పటికీ, తనదైన ప్రత్యేకతను .. క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. సాధారణంగా అవకాశాలు తగ్గుతున్నప్పుడు పారితోషికం పెంచే సాహసం ఎవరూ చేయరు .. కానీ తమన్నా మాత్రం ఇప్పుడు చేసిన పని అదే.
తన పారితోషికాన్ని ఆమె పదో పరకో అన్నట్టుగా పెంచలేదు. ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికానికి రెట్టింపు చేసేసింది. ఇంతవరకూ ఒక్కో సినిమాకి 2 కోట్లు తీసుకుంటూ వచ్చిన ఆమె, ఇప్పుడు ఏకంగా 4 కోట్లు తీసుకుంటోంది. పెంచిన ఈ పారితోషికాన్ని తన తాజా హిందీ చిత్రమైన 'బబ్లీ బౌన్సర్'తో తీసుకోవడం మొదలుపెట్టిందని చెబుతున్నారు.
హిందీలో చేయడం తమన్నాకేం కొత్తకాదు. అక్కడ ఆమె గ్లామర్ కి పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. అందువల్లనే ఈ సినిమాకి మధుర్ భండార్కర్ ఆమెను ఎంచుకున్నాడు.
ఇండియాలో తొలి మహిళా బౌన్సర్ కథ ఆధారంగా, ఫాక్స్ స్టార్ - జంగ్లీ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సర్స్ టౌన్ గా ప్రసిద్ధి చెందిన అసోలా ఫతైపూర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా నిన్ననే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం తమన్నా ఎక్కువగా కష్టపడవలసి వస్తుందనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతోంది. పైగా దీనిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని అంటున్నారు. అందువలన ఈ సినిమాకి తమన్నా ఎక్కువ పారితోషికం తీసుకుని ఉంటుందా? లేదంటే ఇక ఈ మొత్తమే ఇకముందు కూడా కంటిన్యూ చేస్తుందా? అనేది చూడాలి.