Begin typing your search above and press return to search.

'ఆ' సన్నివేశాల్లో హీరోల ప్రవర్తన గురించి తమన్నా షాకింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   29 Dec 2022 12:30 AM GMT
ఆ సన్నివేశాల్లో హీరోల ప్రవర్తన గురించి తమన్నా షాకింగ్ కామెంట్స్‌
X
సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు.. ఇంటిమేట్‌ సీన్స్‌ ను చేసే సమయంలో హీరోయిన్స్‌ కాస్త ఇబ్బంది పడతారని.. హీరోలు మాత్రం ఆ సన్నివేశాలను ఎంజాయ్ చేస్తూ చేస్తారు అంటూ కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే ఆ విషయం పై తమన్నా తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తమన్నా స్పందిస్తూ.. ఆ సన్నివేశాల్లో నటించే సమయంలో హీరోయిన్స్‌ ఎలా అయితే ఇబ్బంది పడతారో అలాగే హీరోలు కూడా మొహమాట పడటం జరుగుతుంది. కొందరు హీరోలు ఇబ్బంది లేకుండా నటించినా కొందరు హీరోలు మాత్రం హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువగా ముడుచుకుపోతారు అన్నట్లుగా తమన్నా వ్యాఖ్యలు చేసింది.

మొహమాటస్తులు ఆ సన్నివేశాలు చేసే సమయంలో కనీసం మాట్లాడే సమయంలో కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కనుక వారు ఆ సన్నివేశాలను ఎక్కువగా చేసేందుకు ఆసక్తి చూపించరని కూడా తమన్నా ఆ చిట్‌ చాట్‌ లో పేర్కొంది. ఆడవారు మగవారు ఇద్దరు కూడా ఆ సన్నివేశాల విషయంలో ఇబ్బందే అన్నట్లుగా తమన్నా పేర్కొంది.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాస్త సినిమాల జోరు తగ్గినా కూడా ముద్దుగుమ్మ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందాలను ఆరబోస్తూ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.