Begin typing your search above and press return to search.
'జిమ్'లో చెమట చిందిస్తున్న మిల్కీబ్యూటీ!
By: Tupaki Desk | 8 Feb 2021 11:00 AM GMTస్టార్ హీరోయిన్ తమన్నా రోజురోజుకి మరింత అందంగా తయారవుతుంది. ఈ పాలబుగ్గల సుందరి ఈ మధ్య సినిమా వార్తలకంటే జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోస్, వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి తమన్నా వయ్యారం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఎందుకంటే కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటికి అదే నాజూకు అందం మెయింటైన్ చేస్తోంది. అందుకే అభిమానులకు కలలరాణిగా వెలిగిపోతుంది. ఎన్ని భాషలలో ట్రై చేసినా తమన్నా స్టార్డం అందుకుంది మాత్రం తెలుగులోనే. అందుకే ఈ బ్యూటీ ఎలాంటి అప్డేట్ ఉన్నా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. తమన్నా నాజూకుతనం చూస్తేనే ఫిట్నెస్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్ధమవుతుంది. తమన్నా డెడికేషన్ గురించి ఇప్పటివరకు చాలానే విన్నాం.
పాత్రకోసం డైటింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కఠోర వ్యాయమసాధన చేస్తుంది. తమన్నా తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే తన మేనికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. లాక్ డౌన్లో బాగా బరువు పెరిగిన తమన్నా నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు మళ్లీ నాజూకుగా తయారై అందరికి ట్రీట్ ఇస్తుంది. వరుస ప్రాజెక్ట్ లతో ఖాళీలేకుండా ఉన్న తమన్నా.. తాజాగా జిమ్ లో చెమట చిందిస్తున్న పిక్ షేర్ చేసింది. ఆ పిక్ చూసి నేటిజన్లు షాక్ తో పాటు వయ్యారి నాజూకు నడుం చూసి ఫిదా అవుతున్నారు. అయితే తమన్నా నటించిన సీటిమార్ సినిమా ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది. ఎఫ్3 ఆగష్టులో రానుంది. ప్రస్తుతం ఆది మహాలక్ష్మి, గుర్తుందా శీతాకాలం, అందధున్, బోలె చుడియన్ సినిమాలు చేస్తోంది. అందధున్ లో ఫస్ట్ టైం బోల్డ్ రొమాంటిక్ రోల్ ప్లే చేయనుంది మిల్కీ బ్యూటీ.