Begin typing your search above and press return to search.

ఆ ఒక్క రాత్రిని తమన్నా ముగించేసింది

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:30 PM GMT
ఆ ఒక్క రాత్రిని తమన్నా ముగించేసింది
X
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 11త్ అవర్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ను ముగించారు. తమన్నాకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అవ్వడంతో నాలుగు వారాల పాటు షూటింగ్‌ లో పాల్గొనలేదు. ఇటీవలే హైదరాబాద్‌ కు తిరిగి వచ్చిన మిల్కీ బ్యూటీ కేవలం వారం రోజుల్లోనే షూటింగ్‌ ను పూర్తి చేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుందని దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ చెబుతున్నాడు. వెబ్‌ సిరీస్‌ మొత్తం కూ డా ఒకే రాత్రిలో జరిగిన కథతో సాగుతుందని పేర్కొన్నాడు.

ఒక ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌ ను బేస్‌ చేసుకుని దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చి ఈ వెబ్‌ సిరీస్‌ ను రూపొందించినట్లుగా చెబుతున్నారు. తమన్నా ఈ వెబ్‌ సిరీస్‌ కోసం కొన్ని బోల్డ్‌ సీన్స్‌ లో కూడా నటించిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ కు సంబంధించిన ట్రైలర్‌ ను రెండు మూడు రోజుల్లో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తి అవ్వడంతో గోపీచంద్‌ సీటీమార్‌ సినిమా షూటింగ్‌ ప్యాచ్‌ వర్క్‌ లో తమన్నా పాల్గొనే అవకాశం ఉందంటున్నారు.