Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ సరికొత్త వ్యాపారం

By:  Tupaki Desk   |   12 Sep 2018 10:27 AM GMT
మిల్కీ బ్యూటీ సరికొత్త వ్యాపారం
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూనే మరో వైపు వ్యాపారంలో కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈతరం హీరోలు వ్యాపారాల్లో అడుగు పెట్టడం కొత్తేం కాదు. పలువురు హీరోలు వ్యాపారాల్లో తమదైన సత్తా చాటుతున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం వ్యాపారాల్లో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలుగు హీరోయిన్‌ రకుల్‌ ఈమద్య ఫిట్‌ నెస్‌ సెంటర్స్‌ వ్యాపారంను ప్రారంభించింది. తాజాగా తమన్నా కూడా వ్యాపార రంగంలో అడుగు పెట్టేందుకు సిద్దం అయ్యింది. ఖరీదైన వజ్రాల వ్యాపారంను తమన్నా చేసేందుకు సిద్దం అవుతుంది.

తమన్నా తన వ్యాపార విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వినాయక చవితి రోజున తన పేరుమీద కొత్త డైమండ్‌ జ్యూవెలరీ బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా ఆమె పేర్కొంది. సౌత్‌ లో ఏ స్టార్‌ పేరు మీద కూడా జ్యూవెలరీ బ్రాండ్‌ లేదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ పలువురు జ్యూవెలరీ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. కాని వారి పేరుపై మాత్రం బ్రాండ్స్‌ లేవు. మొదటి సారి తమన్నా తన పేరుపై బ్రాండ్‌ ను విడుదల చేస్తున్న కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

సినిమా రంగంలో ఈమద్య కాస్త డల్‌ అయిన తమన్నా వ్యాపారంతో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. తెలుగులో ‘ఎఫ్‌ 2’ చిత్రంతో పాటు క్వీన్‌ రీమేక్‌ చిత్రంలో నటిస్తున్న తమన్నా మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సినిమాల నుండి తప్పుకున్న తర్వాత ఆమె పూర్తిగా జ్యూవెలరీ వ్యాపారంలో స్థిరపడి పోయే అవకాశం ఉందని ఆమెకు సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చక్కగా ఒంటబట్టించుకున్న తమన్నా ఇప్పుడు స్టార్‌ గా క్రేజ్‌ ఉన్న సమయంలోనే జ్యూవెలరీ వ్యాపారంను మొదలు పెట్టి సంపాదించాలని ప్రయత్నిస్తుంది. వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్న తమన్నా ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.