Begin typing your search above and press return to search.

నాజూకుగా మారిన పాలబుగ్గల సుందరి.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   23 Jan 2021 1:39 PM GMT
నాజూకుగా మారిన పాలబుగ్గల సుందరి.. వీడియో వైరల్!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా అందం గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఏ ఇండస్ట్రీ అనే తేడాలేకుండా అవకాశం లభించిన అన్ని చోట్లా సక్సెస్ అవుతూ వచ్చింది. అయితే మిల్కీ బ్యూటీగా ఫేమస్ అయిన తమన్నా.. ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నది తెలుగులో మాత్రమే అనాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్ల పైనే అవుతోంది. కానీ అప్పుడు ఎలా ఉండేదో తన అందాన్ని ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తోంది. ఇక ఫిట్నెస్ కి ప్రాధాన్యతనిచ్చే సౌత్ భామలలో తమన్నా ముందుంటుంది. ఖచ్చితంగా డైటింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తోంది. ఇక రెండు నెలల కఠోర వ్యాయమ సాధన తర్వాత అమ్మడు కెమెరా ముందుకి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఈ వయ్యారి తన మేనికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

లాక్ డౌన్ లో బాగా బరువు పెరిగిన తమన్నా నేటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు మళ్లీ నాజూకుగా తయారై అందరికి షాకిచ్చింది. ఈ పాలబుగ్గల సుందరి మళ్లీ నాజూకుగా కనిపించడంతో ఆమె కోట్లాది అభిమానులు ఎంతో ఆనందంగా ఫీలవుతున్నారు. అయితే అమ్మడు ఎలాంటి పరిస్థితులకు లొంగకుండా ఆరోగ్యంగా, బలంగా ఉండాలని చెబుతోంది. తాజాగా అమ్మడు వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే తను ఎలా కోవిడ్ బారినుండి బయటపడిందో చెప్పుకొచ్చింది. ఇక వర్కౌట్ డ్రెస్ లో అమ్మడి సాధనతో పాటు అభిమానులు మెరిసే అందాలను కూడా ఆస్వాదిస్తున్నారు. ఈ ముప్పైఏళ్ళు దాటినా వయ్యారి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా చేస్తోంది. ఇప్పటికే సంపత్ నందితో సీటిమార్ సినిమా కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ గా కనిపించనుంది. అలాగే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది తమన్నా. ప్రస్తుతం ఆది మహాలక్ష్మి, గుర్తుందా శీతాకాలం, అందధున్, బోలె చుడియన్ సినిమాలు చేస్తోంది.