Begin typing your search above and press return to search.
క్వీన్ పాత్ర కోసం కష్ఠాలు
By: Tupaki Desk | 10 Nov 2017 6:25 PM GMTటాలీవుడ్ మిల్కి బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా మొన్నటివరకు హీరోల పక్కనే ఎక్కువగా చేసింది. ఇక మధ్యలో తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించినా కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు తమన్నా తన కెరీర్ లోనే ఒక ఛాలెంజింగ్ రోల్ ని ఎదుర్కోబోతోంది. అంతే కాకుండా తన కెరీర్ లో బెస్ట్ పాత్ర కోసం అమ్మడు చాలా కష్టపడుతోంది.
బాలీవుడ్ లో కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రం రీమేక్ లో తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సౌత్ లో అన్ని భాషల్లో ఈ రీమేక్ పనులు మొదలయ్యాయి. తమన్నా ఎలాగైనా తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని చూస్తోంది. ప్రస్తుతం జిమ్ వర్కౌట్స్ బాగా చేస్తోందట. ఇటీవల మొదటి షెడ్యూల్ నిమిత్తం చిత్ర యూనిట్ ఫ్రాన్స్ వెళ్లింది. అదే విషయాన్ని చెబుతూ.. ఇండియా లో ఉన్నపుడు మూడుసార్లు చేసీ వ్యాయామం ఇక్కడ ఆరుసార్లు చేస్తున్నాని చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా ట్రైనర్ కూడా తమన్నా ని కొంచెం గట్టిగానే కష్టపెడుతున్నాడట. ఉదయన్నే లేపుతూ.. ట్రైనింగ్ ఇస్తున్నాడని వినరించింది. ఇక క్వీన్ సినిమాలో తాను కొత్తగా కనిపించేందుకు ఈ వర్కవుట్స్ అని మిల్కి బ్యూటీ తెలిపింది. ఈ సినిమాలో తమన్నా తో పాటు గుంటూరు టాకీస్ ఫెమ్ సిద్ధూ జొన్నలగడ్డ కూడా నటిస్తున్నాడు.