Begin typing your search above and press return to search.
కరోనా: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హీరోయిన్ తమన్నా
By: Tupaki Desk | 5 Oct 2020 5:34 PM GMTకోట్లాది మందిని వణికిస్తున్న కరోనా సినీ సెలెబ్రెటీలను కూడా వదలడం లేదు. ఇటీవలే ప్రముఖ హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆమె అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
తాజాగా హీరోయిన్ తమన్నా కు కరోనా సోకగా హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చేరారు. ఇటీవల తమన్నా తీవ్ర జ్వరం రావడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా టెస్ట్ కూడా చేశారు. ఈ రిపోర్ట్ లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతోంది.
అయితే జ్వరం తగ్గడం.. ఇతర లక్షణాలు తగ్గిపోవడంతో వైద్యులు తమన్నాను ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది. హోం ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారని.. మందులు తీసుకుంటూ ఇంట్లోనే కరోనాకు చికిత్స తీసుకుంటానని తమన్నా తెలిపారు.
ఇటీవలే కొద్దిరోజుల కిందట తమన్నా తల్లిదండ్రులకు సైతం కరోనా సోకింది. అదే సమయంలో వారితో ఉన్న తమన్నా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. తాజాగా పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం తమన్నా గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.