Begin typing your search above and press return to search.

ముచ్చటగా మూడోసారి మిల్కీబ్యూటీ!

By:  Tupaki Desk   |   22 Sept 2019 12:41 PM IST
ముచ్చటగా మూడోసారి మిల్కీబ్యూటీ!
X
డైరెక్టర్ సంపత్ నంది సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోతున్నాయి. అయితే సంపత్ మాత్రం ఆ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా తన కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ హీరోలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ తో సంపత్ తన నెక్స్ట్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందని సమాచారం. ఈ సినిమాలో గోపీ సరసన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన 'రచ్చ'.. 'బెంగాల్ టైగర్' సినిమాల్లో తమన్నా హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ కొత్త సినిమా సంపత్ నంది - తమన్నా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కానుంది. హీరోయిన్లను రిపీట్ చేయడం చాలామంది దర్శకులకు అలవాటు. ఇప్పుడు సంపత్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.

ఇదిలా ఉంటే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆఫర్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ఫిలిం 'సైరా' లో తమన్నా ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు 'దట్ ఈజ్ మహాలక్ష్మి' సినిమాలో నటిస్తోంది. విశాల్ కొత్త సినిమా 'యాక్షన్' లోనూ.. మరో తమిళ సినిమా 'పెట్రోమాక్స్' లోనూ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.