Begin typing your search above and press return to search.

తమన్నా సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   28 Sept 2018 7:00 AM IST
తమన్నా సంచలన నిర్ణయం
X
టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ తమన్నా ఉన్నట్లుండి ప్యూర్‌ వెజిటేరియన్‌ గా మారిపోవాలని నిర్ణయించుకుంది. చికెన్‌ - మటన్‌ - ఫిష్‌ ఇలా అన్ని మాంసహార వంటలను ఎంతో ఇష్టపడి తినే తమన్నా ఇకపై వాటికి పూర్తిగా దూరంగా ఉండబోతున్నట్లుగా ప్రకటించింది. ఈమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. తాను శాఖాహారిగా మారడంకు గల కారణంను తమన్నా సుదీర్ఘంగా వివరించింది.

తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల గత నెల రోజులుగా అనారోగ్యం బారిన పడటం వల్లే తాను మాంసహారంకు దూరం అయినట్లుగా ప్రకటించింది. తమ ఇంట్లో ఒక వ్యక్తిగా పెరిగిన అతడు(కుక్కపిల్ల) అనారోగ్యంతో బాధపడుతుంటే చాలా బాధగా ఉంది. ఇంట్లో వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత అస్సలు ఉండదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉందని, అందుకే అతడి ఆరోగ్యం బాగుపడటంతో పాటు, నా ఆరోగ్యం కూడా బాగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో శాఖాహారిగా మారిపోయానని ప్రకటించింది.

శాఖాహారిగా ఉండటం చాలా కష్టమైన పని, గ్రీన్‌ కూరగాయలను తీసుకోవడం మామూలు విషయం కాదని కొన్ని రోజుల్లోనే తెలుసుకున్నాను. అయినా కూడా తాను ఇకపై శాఖాహారమే తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి తాజాగా చిరంజీవి 152వ చిత్రంలో నటించే అవకాశం కూడా వచ్చిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.