Begin typing your search above and press return to search.
పాత ప్రేయసితో తమాషా విజయం
By: Tupaki Desk | 28 Nov 2015 6:24 AM GMTరణబీర్ కపూర్ - దీపిక పదుకొన్ జంట తెరపై కనిపిస్తోంది అంటే ఆ ఇద్దరి మధ్యా కెమిస్ర్టీ ఏ లెవల్ లో ఉంటుందో ఊహించవచ్చు. ఈ ఇద్దరూ మాజీ ప్రేమికులు. పైగా రెండు విజయవంతమైన సినిమాల్లో నటించారు. అందుకే ఈ జంట ముచ్చటగా మూడో సినిమాలో నటిస్తున్నారు అనగానే ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. ముఖ్యంగా విడిపోయిన ప్రేమికుల్ని కలిపేస్తూ ఇంతియాజ్ అలీ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు అనగానే బాలీవుడ్ మొత్తం అటువైపే చూసింది. లేటెస్టుగా రణబీర్-దీపిక-ఇంతియాజ్ కలయికలో తమాషా అనే చిత్రం థియేటర్లలోకి రిలీజైంది. ఈ మూవీలో తమాషా లవ్ స్టోరీ కుర్రాళ్లను ఇట్టే ఆకట్టుకుంటోందని, ప్రతి ఒక్కరూ ఇలాంటి లవ్ స్టోరీ తమ జీవితాలలో ఉండాలని కోరుకుంటారని ప్రశంసలొస్తున్నాయి.
అనగనగా ఓ అమ్మాయి - ఓ అబ్బాయి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోరు. కనీసం పేర్లు కూడా తెలీవు. కలిసే జీవిస్తారు. సుదూర తీరాలకు వెళ్లిపోతారు. ఏదైనా దీవిలో ఒంటరి జంటగా గడిపేస్తారు. ఇలాంటి కథతో చాలా సినిమాలే వచ్చినా ఇంతియాజ్ అలీ తమాషా చిత్రాన్ని కొత్తగా చూపించాడు. అచ్చంగా రణబీర్ - దీపిక రియల్ లైఫ్ లవ్ స్టోరీలా అనిపిస్తున్నా.. రియాలిటీలో ఒకరికొకరు తెలుసు. వాళ్ల పేర్లు కూడా తెలుసు. కాబట్టి తమాషా మూవీలో ఇంట్రెస్టింగ్ గా పేర్లు తెలియని అపరిచితుల్లా నటించి మెప్పించారు. యూత్ కి కిక్కెక్కించే బ్యూటిఫుల్ ఎగ్జోటిక్ లొకేషన్లలో రక్తి కట్టించేలా సినిమాని తెరకెక్కించారని ప్రశంసలొస్తున్నాయి. అలాగే ఏ.ఆర్.రెహమాన్ బాణీలు - ఆర్.ఆర్ ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతోందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి యంగ్ పెయిర్ హ్యాట్రిక్ కొట్టిందన్నమాట!