Begin typing your search above and press return to search.
సంచలనం..'తమిళ్ రాకర్స్' లో విశాల్ కు వాటా ఉందట
By: Tupaki Desk | 20 Dec 2018 2:07 PM GMTనడిగర్ సంఘం కార్యదర్శిగా.. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కోలీవుడ్లో ఇన్నాళ్లూ చక్రం తిప్పిన విశాల్ కు ఇప్పుడు అక్కడ ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. ఇంతకాలం విశాల్ వైపు ఉన్నవాళ్లే అతడికి వ్యతిరేకులుగా మారిపోయారు. ఇప్పటికే విశాల్ అంటే గిట్టని వాళ్లంతా.. అతడి వర్గీయుల్ని తమ వైపు తిప్పుకుని విశాల్ మీదికి ఉసిగొల్పుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు విశాల్ వ్యతిరేకులంతా కలిసి నిర్మాతల మండలి భవనానికి తాళాలు వేసి వాటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించింది ఓ వర్గం. దీనిపై ఈ రోజు విశాల్ స్పందించాడు. తన సహచరులతో కలిసి వెళ్లి తాళాలు పగలగొట్టించాడు. ఈ సందర్భంగా అతడి వర్గీయులకు.. వ్యతిరేకులకు మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు విశాల్ సహా పలువురిని అరెస్టు చేశారు.
ఐతే నిన్న నిర్మాతల మండలితో సంబంధం లేని వ్యక్తులు కార్యాలయానికి తాళాలు వేస్తుంటే పట్టించుకోని పోలీసులు ఈ రోజు తననెలా అరెస్టు చేశారని విశాల్ ప్రశ్నించాడు. ఎవరేం చేసినా తాను తగ్గేది లేదని.. అధ్యక్షుడిగా తాను చేయాలనుకున్నది చేస్తానని.. త్వరలోనే తలపెట్టిన ఇళయరాజా కన్సర్ట్ కచ్చితంగా పూర్తి చేస్తానని అన్నాడు విశాల్. ఐతే విశాల్ ను ఎలాగైనా అధ్యక్ష పదవి నుంచి దించాలని చూస్తున్న వ్యతిరేక వర్గం అతడి మీద తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేస్తోంది. నిర్మాత అళగప్పన్ అయితే విశాల్ మీద ఊహించని ఆరోపణలు చేశాడు. అతడికి పైరసీ సంస్థ తమిళ్ రాకర్స్ తో సంబంధాలు ఉన్నాయన్నాడు. నిర్మాతల మండలి అధ్యక్షుడు అయినప్పటి నుంచి తమిళ్ రాకర్స్‌తో విశాల్ పోరాటం సాగిస్తున్నాడు. ఈ పోరాటంలో నెగ్గలేకపోయాడు కానీ.. విశాల్ సిన్సియర్ ఎఫర్టే పెడుతున్నాడన్న అభిప్రాయం కోలీవుడ్లో ఉంది.
అలాంటిది అతడికి ఈ వెబ్ సైట్ తో సంబంధం ఉందని.. వాటా కూడా కలిగి ఉన్నాడని ఆరోపించడం తీవ్ర విషయమే. మరోవైపు ఈ వారం ఒకేసారి తొమ్మిది సినిమాలు విడుదల కావడానికి నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ ఆమోదం తెలపడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అందులో విశాల్ తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్న కన్నడ డబ్బింగ్ సినిమా ‘కేజీఎఫ్’ కూడా ఉంది. కర్ణాటకలో అక్కడని నిర్మాతల మండలి తమిళ డబ్బింగ్ చిత్రాల్ని విడుదల కానివ్వడం లేదు. కానీ విశాల్ మాత్రం ఇక్కడ కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కేజీఎఫ్’ను రిలీజ్ చేస్తుండటాన్ని తమిళ నిర్మాతలు తప్పుబడుతున్నారు. మరోవైపు మండలి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని కోరినా విశాల్ తప్పించుకుంటున్నాడని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా తనపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విశాల్ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.