Begin typing your search above and press return to search.

మరో నటున్ని బలిగొన్న కరోనా..తమిళ ఇండస్ట్రీలో విషాదం

By:  Tupaki Desk   |   15 Sep 2020 11:30 AM GMT
మరో నటున్ని బలిగొన్న కరోనా..తమిళ ఇండస్ట్రీలో విషాదం
X
కరోనా సినీ ఇండస్ట్రీని కల్లోలం చేస్తోంది. ఆ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూత పడి ఆ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. మరో వైపు వైరస్ బారిన పడి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కన్నుమూశారు. ఇటీవల బాలీవుడ్ లో సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్, నిర్మాత అనిల్ సూరి కన్నుమూయగా, తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత పోకూరి రామారావు చనిపోయారు. కోలీవుడ్ కు చెందిన నిర్మాత స్వామినాథన్ కూడా మృతి చెందారు. తాజాగా కోలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ నటుడు ఫ్లోరెంట్ సి.పెరేరియా(67) సోమవారం కన్నుమూశారు. ఆయన కరోనా బారిన పడగా కొద్దిరోజుల కిందట కుటుంబీకులు చికిత్స నిమిత్తం రాజీవ్‌గాంధీ జనరల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో పెరేరియా కన్నుమూశారు. పెరేరియా ధనుష్ హీరోగా నటించిన వీఐపీ 2, రైల్‌ సహా పలు చిత్రాల్లో నటించారు. పెరేరియా నటుడిగానే కాదు.. తమిళ ప్రముఖ టీవీ ఛానెల్ కళైగ్నర్ టీవీ ఛానెల్ సంస్థకు జనరల్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. ఫ్లోరెంట్ సి.పెరేరియా మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా పెరేరియా మృతి పై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.