Begin typing your search above and press return to search.
పెళ్లికి నేను ఒప్పుకోలేదు.. 56 ఏళ్ల పృథ్వీ షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 30 Oct 2022 7:30 AM GMT56 ఏళ్ల సీనియర్ నటుడు పృథ్వీ 24 ఏళ్ల శీతల్ అనే అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వార్తల్లో నిజం ఉండి ఉండదు అని.. త్వరలోనే ఆయన మీడియా ముందుకు వచ్చి వస్తున్న వార్తలు నిజం కాదు అంటూ చెప్పే అవకాశం ఉందని అంతా భావించారు.
కానీ తాజాగా సీనియర్ నటుడు పృథ్వీ మీడియా ముందుకు వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో జరుగుతున్నట్లుగా తామిద్దరం పెళ్లి చేసుకోలేదు అన్నాడు. అయితే ప్రస్తుతం తాము రిలేషన్ లో ఉన్నామని పేర్కొన్నాడు. త్వరలో పెళ్లి చేసుకుంటాం అన్నాడు. మొదట శీతల్ పెళ్లి ప్రస్థావన తీసుకు వచ్చిన సమయంలో నేను ఒప్పులేదు.
పెళ్లి గురించి ఆమె చెప్పగా నేను కాదన్నాను. కానీ పట్టుబట్టడంతో పాటు శీతల్ కుటుంబం కూడా ఒప్పుకోవడంతో నేను పెళ్లి కి ఒప్పుకున్నాను అంటూ పృథ్వీ పేర్కొన్నాడు. భార్య తో గత కొన్నాళ్లుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగానే ఆమె నుండి విడిపోయినట్లుగా పేర్కొన్నాడు.
శీతల్ చాలా చక్కగా నన్ను అర్థం చేసుకుంటుంది. ఆమె చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుందని పృథ్వీ పేర్కొన్నాడు. ఇంకా తామిద్దరం కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో చాలా మంది విమర్శిస్తారు అని ముందే తెలుసు. వాటన్నింటికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నాడు.
అదే ఇంటర్వ్యూలో శీతల్ మాట్లాడుతూ వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. పృథ్వీ గారితో జీవితంను పంచుకోవడం అనేది నా జీవితానికి సార్థకం కలిగిస్తుందని పేర్కొంది. ఇంకా శీతల్ ను మలేషియాకు చెందిన అమ్మాయి అని.. ఆమె వయసు 20 ఏళ్లు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఆ వార్తలపై పృథ్వీ స్పందిస్తూ.. ఆమె మలేషియాకు చెందిన అమ్మాయి కానే కాదు. ఆమె తెలుగు అమ్మాయి. అంతే కాకుండా ఆమె వయసు కూడా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా 20 కాదని.. 24 ఏళ్ల వయసు అన్నట్లుగా పృథ్వీ పేర్కొన్నాడు. పెళ్లి విషయమై త్వరలోనే మరింత స్పష్టత ఇస్తాం అన్నట్లుగా పృథ్వీ పేర్కొన్నాడు.