Begin typing your search above and press return to search.
తమిళ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు
By: Tupaki Desk | 14 March 2016 4:26 PM GMTతమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకుని కోలీవుడ్ జనాల్ని విస్మయానికి గురి చేశాడు. సాయి ప్రశాంత్ వయసు 30 ఏళ్లు మాత్రమే. తన ఇంట్లోనే కూల్ డ్రింక్ లో విషం కలుపుకుని తాగి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా అతను మూడు పేజీల సూసైడ్ నోట్ కూడా రాశాడు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని అందులో పేర్కొన్నాడు. డిప్రెషన్ వల్లే సాయిప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సాయిప్రశాంత్ మొదటి భార్యతో విడాకులు తీసుకుని మూడు నెలల కిందటే సుజిత అనే అమ్మాయిని పెళ్లాడటం గమనార్హం. ఐతే తన ఆత్మహత్యకు సుజిత ఎంత మాత్రం కారణం కాదని.. ఆమెను నిందించవద్దని ప్రశాంత్ లేఖలో కోరాడు. తానే తనకు ఓ సమస్య అని ప్రశాంత్ పేర్కొన్నాడు. సుజితకు తన తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదుతో పాటు ఆమె నగలు కూడా ఇచ్చేయాలని అతను పేర్కొన్నాడు.
వీడియో జాకీగా ప్రస్థానం ఆరంభించి తమిళ సీరియళ్లలో నటించిన సాయి ప్రశాంత్.. తర్వాత సినిమాల్లోనూ నటించాడు. తెలుగులోకి రన్ పేరుతో రీమేక్ అయిన నేరం మూవీలోనూ అతను ఓ కీలక పాత్ర చేశాడు. తెలుగులోకి డబ్ అయిన భద్రమ్ చిత్రంలోనూ ఓ క్యారెక్టర్ చేశాడు. మూడు రోజుల కిందటే ఓ తమిళ సీరియల్ షూటింగులో పాల్గొన్న సాయిప్రశాంత్.. ఇంతలోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడటాన్ని అక్కడి జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు.