Begin typing your search above and press return to search.
మరో హీరో కూడా వదిలేశాడు..
By: Tupaki Desk | 23 Sep 2015 8:00 AM GMTట్విట్టర్ వదిలేస్తా.. ఓ టైంలో సల్మాన్ కూడా ఈ మాట చెప్పాడు. సల్లూ భాయ్ చెప్పాడు కానీ.. కొంతమంది సెలబ్రిటీలు ఇప్పటికే వదిలేశారు కూడా. అభిమానులతో నిరంతరం కనెక్ట్ అయ్యేందుకు ట్విట్టర్ ప్రధాన ప్లాట్ ఫాం అయినా.. దీంతో వారికి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అభిమానుతో కాంటాక్ట్స్ బాగానే ఉన్నా.. సతాయించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటితో విసిగిపోయినట్లున్నాడు తమిళ స్టార్ హీరో శింబు. అందుకే ట్విట్టర్ ను వదిలిపెట్టేస్తున్నానని.. ఇకపై ఈ వాల్ ని అభిమాన సంఘాలు హ్యాండిల్ చేస్తాయని చెప్పాడు.
సినిమాలపై మరింతగా దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్న శిలాంబరసన్ అలియాస్ శింబు. ఫ్యాన్స్ కి స్టారీ్ హీరో ల మధ్య అనుబంధం పెంచేవి మంచి సినిమాలే కానీ.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కాదని అభిప్రాయపడ్డాడు ఈ కోలీవుడ్ హీరో. శింబు చెప్పిన కారణాలు అందంగానే ఉన్నాయి కానీ.. వాస్తవం వేరేగా ఉందని టాక్. ఈ మధ్య కొన్ని సార్లు విపరీతమైన నెగిటివ్ కామెంట్లను ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా లవ్ ఎఫైర్స్ విషయంలో.. దారుణమైన కామెంట్స్ పడ్డాయి శింబూకి. వీటికి సమాధానం చెప్పడం ఇతగాడికి తలనొప్పిగా మారిపోయింది.
అసలే నెగిటివ్ కామెంట్స్ ని స్పోర్టివ్ గా తీసుకునే తత్వం శింబూకి తక్కువ. అటు ఫాలోయర్స్ ని పబ్లిక్ గా అనలేక, ఇటు సమాధానం చెప్పలేక బాగా మధనపడాల్సి వచ్చిందట. అందుకే ట్విట్టర్ ని వదిలేయడమే పరిష్కారంగా ఎంచుకున్నాడని అంటున్నారు. ఏమైనా.. నిత్యం వివాదాల్లో ఉండేవాళ్లు.. జనాలతో కనెక్ట్ అయి ఉండడం కష్టమే.