Begin typing your search above and press return to search.

#2020 ట్రీట్: సూర్య బ్యాక్ టు బ్యాక్ ధ‌మాకా

By:  Tupaki Desk   |   6 March 2020 4:00 AM GMT
#2020 ట్రీట్: సూర్య బ్యాక్ టు బ్యాక్ ధ‌మాకా
X
ఆవేశం .. రౌద్రం తో కూడుకున్న కాప్ రోల్స్ కి సూర్య పెట్టింది పేరు. యాక్షన్‌ ప్రధాన చిత్రాలకు.. ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌కు కోలీవుడ్ హీరో సూర్య కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు. ఓ స్టార్‌ హీరోగా మూడు నాలుగేళ్ళుగా స‌రైన‌ హిట్ అన్న‌దే లేకపోయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉండ‌డం మామూలు విషయం కాదు. జయాపజయాలకు అతీతంగా తన ఇమేజ్ ని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. 'ఎస్‌3'(యముడు3) నుంచి సరైన విజయాలు లేవు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన '24' క్రిటిక్స్ ని మెప్పించినా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలై నిరాశ‌ప‌రిచింది. ఆ తర్వాత మరే చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. గతేడాది విడుదలైన 'కప్పాన్‌' ఫర్వా లేదనిపించినా తెలుగు లో ఆడ‌లేదు.

ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సూర్య నెక్ట్స్ సినిమాల విషయంలో స్పీడ్‌ పెంచారు. అది మామూలు స్పీడ్‌ కాదు. ఈసారి ఏకంగా ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో నటిస్తున్నారు. ఎయిర్‌ డెక్కర్ వ్య‌వ‌స్థాపకుడు గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు మరో మూడు సినిమాలకు సూర్య ఓకే చెప్పారు. 'ఆకాశమే నీ హద్దురా' విడుదల తర్వాత వెంటనే తనకు 'సింగం' వంటి యాక్షన్‌ ప్రధాన సిరీస్ ని ఇచ్చిన హరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్‌ కథానాయిక గా నటించనుంది. సూర్య కెరీర్ 39వ చిత్రం ఇది. దీనికి 'అరువా' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 'అరువా' అంటే కత్తి అని అర్థం.

ఆ రెండిటితో పాటు వెట్రిమారన్‌ డైరెక్షన్ లో తన 40వ చిత్రం చేయబోతున్నారు. ఈ స్క్రిప్ట్ కూడా ఓకే అయ్యింది. వెట్రిమారన్‌ గతేడాది ధనుష్‌ తో 'అసురన్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ని రూపొందించారు. ఇది ఇప్పుడు తెలుగులో వెంకీ హీరోగా 'నారప్ప' పేరుతో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు సూర్య మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. తన నిర్మాణం లో తెరకెక్కించిన `పసంగ 2` కార్తీ హీరోగా నటించిన 'చినబాబు' చిత్రాలకు దర్శకత్వం వహించిన పాండిరాజ్‌ డైరెక్షన్ లో తన 41వ సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. వీరి కాంబినేషన్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ రాబోతుందని తెలుస్తోంది. మరి సూర్యకి ఈ సినిమాలైనా విజయాలను అందిస్తాయా అనేది చూడాలి. కానీ ఈ ఏప్రిల్‌ నుంచి బ్యాక్‌ టూ బ్యాక్‌ తన సినిమాలతో ఫ్యాన్స్ ని సూర్య ఖుషీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే సూర్య సినిమాల‌కు తెలుగు లో ప్ర‌మోష‌న్ మ‌రీ వీక్ గా ఉంటోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల అత‌డి తెలుగు మార్కెట్ మ‌రీ కింది స్థాయికి ప‌డిపోవ‌డం చ‌ర్చ‌కొస్తోంది. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తిరిగి అత‌డి ఇమేజ్ ని పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఆ ఒక్క‌టీ ఎప్ప‌టికి వ‌స్తుందో చూడాలి.