Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ వద్ద 'లాఠీ' పోటు ఖాయమేనా?
By: Tupaki Desk | 20 Dec 2022 2:30 PM GMTయాక్షన్ స్టార్ విశాల్ సౌండింగ్ బాక్సాఫీస్ వద్ద వినిపించి చాలా కాలమైంది. ఈ మధ్య కాలంలో విశాల్ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో రాణించలేదు. `డిటెక్టివ్` తర్వాత చేసిన కొన్ని ప్రయత్నాలు పర్వాలేదు అనిపించాయి తప్ప! బాక్సాఫీస్ ని రప్ఫాడించిన చిత్రమైతే కనిపించలేదు. తాజాగా డిసెంబర్ 22న `లాఠీ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
తమిళ్ సహా తెలుగు భాషలోనే అదే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. టీజర్..ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇందులో విశాల్ ఓ సాధారణ కానిస్టేబుల్ పాత్రతోనే వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తోంది. ప్రత్యర్ధులకు లాఠీ పోటు ఎలా ఉంటుందో కానిస్టేబుల్ రుచి చూపించాడు.
లాఠీకి సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి ఉంది. ఆ `లాఠీ`తో విశాల్ సమాజంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడన్నది తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో విశాల్ పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నాడు. సెకండాఫ్ లో 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లు ప్రీటీజర్ ని బట్టి విశాల్ మరో లెవల్ యాక్షన్ మూవీలో నటించాడని అర్థమవుతోంది.
లాఠీ కోసం కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లోనూ నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో వాస్తవికత కోసం నాలుగంతస్తుల భవనం నుంచి దూకడం వంటివి రియిల్ గా చేసిన సన్నివేశాలు. అభిమానుల కోసం నాలుగు కాదు..ఎనిమిది అంతస్తులైనా దూకుతా నని ఛాలెంజ్ చేసి మరి సినిమా కోసం పని చేసాడు. ఇలాంటివన్ని లాఠీపై అంచనాల్ని అంతకంతకు పెంచేస్తున్నాయి.
మరోవైపు ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళ్ సహా తెలుగులోనూ పీఆర్ టీమ్ లు ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకి అన్ని వైపులా నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో ఉన్న సమయాన్ని వీలైనంతగా ప్రేక్షకుల్లోకి సినిమాని బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అంతిమంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ - నందా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా హీరోయిన్ గా నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.