Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : విలన్‌ గా మారిన కమెడియన్‌!

By:  Tupaki Desk   |   6 Nov 2020 1:30 PM GMT
ఫొటోటాక్‌ : విలన్‌ గా మారిన కమెడియన్‌!
X
కోలీవుడ్‌ లో ఫేమస్‌ కమెడియన్స్‌ లో వివేక్‌ ఒకరు. ఒకానొక సమయంలో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల సినిమాల్లో కూడా వివేక్‌ కనిపించేవారు. ఈమద్య కాస్త ఈయన ప్రభావం తగ్గింది. కమెడియన్‌ గానే కాకుండా హీరోగా కూడా తన అదృష్టంను పరీక్షించుకున్న వివేక్‌ ఈసారి తన అదృష్టంను మరోలా పరీక్షించుకోబోతున్నాడా అంటూ ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. చూడగానే నవ్వు తెప్పించే వివేక్‌ ఈ ఫొటోలో మాత్రం చాలా రఫ్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు. వివేక్‌ ప్రతి సినిమాను కూడా రెగ్యులర్‌ గెటప్‌ తోనే చేస్తూ ఉంటాడు. కాని ఈసారి విభిన్నమైన గెటప్‌ లో కనిపించడంతో అంతా కూడా ఈసారి వివేక్‌ విలన్‌ పాత్రలో నటించబోతున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

స్టార్‌ హీరో అజిత్‌ లుక్‌ లో వివేక్‌ కనిపించి అందరిని ఆశ్చర్య పర్చాడు. ఈ లుక్‌ హీరోగా చేయబోతున్న సినిమాలోనిదా లేదంటే విలన్‌ గా చేయబోతున్న సినిమాలోనిదా అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో వివేక్‌ అభిమానులు హీరోగా చూడాలని ఆశపడుతున్నారు. కాని అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం వివేక్‌ లుక్‌ విషయమై నెట్టింట చర్చ జరుగుతోంది. వివేక్‌ ను మొత్తానికి కొత్తగా చూడటం పట్ల అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.